Coolie : రజనీ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ సినిమా.. కూలి కోసం ఖర్చు చేసింది ఎంతంటే!

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రం భారీ విజయం సాధించిన తర్వాత ప్రస్తుతం ఆయన కూలీ సినిమాతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీగా ఉన్నారు.

Update: 2025-08-11 08:00 GMT

 Coolie : రజనీ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ సినిమా.. కూలి కోసం ఖర్చు చేసింది ఎంతంటే!

Coolie : సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రం భారీ విజయం సాధించిన తర్వాత ప్రస్తుతం ఆయన కూలీ సినిమాతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఈ వారం అంటే ఆగస్టు 14న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 74 ఏళ్ల వయసులో కూడా రజనీకాంత్ అసాధారణంగా పనిచేస్తుండటంతో, ఆయనకు భారీగా పారితోషికం అందుతోంది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కూలీ సినిమా బడ్జెట్ గురించి ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించినట్లుగా సమాచారం. ఈ బడ్జెట్‌లో రజనీకాంత్ ఒక్కరి పారితోషికమే అక్షరాలా రూ. 150 కోట్లు అని చెబుతున్నారు. రజనీ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రంగా కూలీ నిలవడం విశేషం. ఈ సినిమా బడ్జెట్‌లో రజనీ సంపాదనతోనే మరో పెద్ద బడ్జెట్ చిత్రాన్ని నిర్మించవచ్చు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కూలీ సినిమాలో పారితోషికాలు ఆసక్తికరంగా మారాయి. దర్శకుడు లోకేశ్ కనకరాజ్, నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ భారీగా పారితోషికాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన లోకేశ్ కనకరాజ్ రూ.50 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. నటీనటుల విషయానికి వస్తే, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ రూ.20 కోట్లు, టాలీవుడ్ నటుడు నాగార్జున రూ.10 కోట్లు తీసుకున్నారు. అలాగే కన్నడ స్టార్ ఉపేంద్ర, నటి శృతి హాసన్ ఇద్దరికీ చెరో రూ. 4 కోట్లు చెల్లించారు.

ఇక, ఇతర నటీనటులైన సత్యరాజ్, సౌబిన్ షాహిర్ చెరో రూ. కోటి పారితోషికం తీసుకున్నారు. స్పెషల్ సాంగ్ లో మెరిసిన పూజా హెగ్డేకు రూ. 3 కోట్లు చెల్లించారు. ఈ చిత్రానికి సంగీతం అందించిన అనిరుధ్ కూడా రూ.15 కోట్లు అందుకున్నారు. ఈ భారీ పారితోషికాలను బట్టి, ఈ సినిమా ఎంత పెద్ద బడ్జెట్‌తో తెరకెక్కిందో అర్థం చేసుకోవచ్చు. ఈ భారీ తారాగణం, సాంకేతిక నిపుణుల కలయికతో సినిమాపై మరింత హైప్ పెరిగింది.

ఈ సినిమా ప్రచారం కోసం కూడా భారీగా ఖర్చు చేసినట్లుగా చెబుతున్నారు. సినిమా ప్రచారానికి దాదాపు రూ. 25 కోట్లు ఖర్చు చేసినట్లుగా అంచనా. ఈ ఖర్చుతో కలిపి మొత్తం సినిమా బడ్జెట్ రూ. 375 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Tags:    

Similar News