రజనీకాంత్ బర్త్‌డే సర్ప్రైజ్: ‘నరసింహ’ సీక్వెల్ కాన్ఫమ్… టైటిల్ కూడా రివీల్!

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్. 26 ఏళ్ల క్రితం వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘నరసింహ’ (తమిళంలో ‘పడయప్ప’)కు ఇప్పుడు అధికారికంగా సీక్వెల్ రాబోతుందని స్వయంగా రజనీ ప్రకటించాడు.

Update: 2025-12-09 08:03 GMT

రజనీకాంత్ బర్త్‌డే సర్ప్రైజ్: ‘నరసింహ’ సీక్వెల్ కాన్ఫమ్… టైటిల్ కూడా రివీల్!

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్. 26 ఏళ్ల క్రితం వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘నరసింహ’ (తమిళంలో ‘పడయప్ప’)కు ఇప్పుడు అధికారికంగా సీక్వెల్ రాబోతుందని స్వయంగా రజనీ ప్రకటించాడు. అంతేకాదు కొత్త మూవీకి ‘నీలాంబరి’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు వెల్లడించాడు.

సీక్వెల్ అనౌన్స్ చేసిన రజనీ

డిసెంబర్ 12న రజనీకాంత్ 75వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. అదే రోజున ‘నరసింహ’ రీరిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో విడుదలైన స్పెషల్ వీడియోలో రజనీ ఇలా అన్నారు:

“2.0 చేస్తున్నాం… జైలర్ 2 చేస్తున్నాం… అయితే పడియప్ప 2 ఎందుకు వద్దు అనుకున్నాం. అలానే ‘నీలాంబరి’ అనే టైటిల్‌తో సీక్వెల్ తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. ప్రస్తుతం స్టోరీ చర్చలు జరుగుతున్నాయి.”

ఎందుకు ‘నీలాంబరి’ టైటిల్?

1999లో విడుదలైన ‘నరసింహ’ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర సినిమాకు ప్రత్యేక హైలైట్. ఆ పాత్రకు ఉన్న క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. అందుకే సీక్వెల్‌కి ఆ పేరునే టైటిల్‌గా పెట్టడం విశేషం.

నరసింహ – ఒక క్లాసిక్ బ్లాక్‌బస్టర్

రజనీకాంత్, సౌందర్య, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు.

రజనీ కెరీర్‌లో అత్యంత భారీ విజయాలలో ‘నరసింహ’ ఒకటి.

ప్రత్యేకంగా నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ చేసిన నటన అద్భుతమని ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు.

అభిమానుల్లో హైప్ పెరిగింది

26 ఏళ్ల తర్వాత సీక్వెల్ రాబోతుందన్న వార్త అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ముందుగా డిసెంబర్ 12న రీరిలీజ్‌ను ఎంజాయ్ చేయడానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. ఆ తరువాత ‘నీలాంబరి’పై అధికారిక అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News