దయచేసి ఇబ్బంది పెట్టకండి- రజినీకాంత్‌

తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ అభిమానులకు మరోసారి నిరాశే మిగిలింది.

Update: 2021-01-11 07:21 GMT
రజనీ కాంత్

తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ అభిమానులకు మరోసారి నిరాశే మిగిలింది. రాజకీయ రంగ ప్రవేశంపై అభిమానులకు మరోసారి స్ఫష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి రానని, ఇబ్బందిపెట్టోదని రజినీకాంత్ కోరారు. గతంలోనే రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పినట్లు గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. దయచేసి ఇంకెవ్వరూ తనను రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించి ఇబ్బంది పెట్టవద్దంటూ స్పష్టం చేశారు. రజినీకాంత్ తన విజ్ఞప్తిని లేఖ రూపంలో ట్విట్టర్‌ ద్వారా సోమవారం విడుదల చేశారు‌.

తలైవా తన నిర్ణయాన్నిమరోసారి పరిశీలించుకోవాలని కొందరు అభిమానలు కోరారు, రజనీ మక్కళ్‌ మండ్రం బాద్యతల నుంచి, మండ్రం నుంచి తొలగించబడిన పలువురితో కలిసి చెన్నైలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఆందోళన కూడా చేశారు. దాదాపు నిరసన తెలపడానికి చెన్నై పోలీసులు 200మందికి మాత్రమే అనుమతినివ్వగా., 2వేల మందికిపైగా అభిమానులు అక్కడికి చేరుకోవడం విశేషం. 'వా తలైవా వా', 'ఇప్పో ఇల్లన ఎప్పొవమ్ ఇల్ల' వంటి నినాదాలతో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం వరకు చైన్నైమొత్తం మారుమోగిపోయింది.

గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సూపర్‌స్టార్..ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని ప్రకటించలేనని ఆయన చెప్పారు. అభిమానులు తనను నన్ను క్షమించాలని ట్వీట్‌ చేశారు తలైవా. రజినీకాంత్ రాజకీయాల్లో రావాలంటూ అభిమానులు ఆదివారం ఓ ర్యాలీని నిర్వహించడంతో ఆయన స్పందించారు. డిసెంబర్ 31న పార్టీ పేరును ప్రకటిస్తానని గతంలో రజనీకాంత్‌ తెలిపారు. అయితే ఆయన అస్వస్థతకు గురికావడంతో కొద్ది రోజులు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆ తర్వాత డిశ్చార్జి అయి చెన్నైకి వెళ్లారు. తనకు ఆరోగ్యం సహకరించకపోవడంతో రాజకీయ పార్టీ పేరును ఇప్పట్లో ప్రకటించడంలేదని ట్విట్టర్‌లో తెలిపారు.

Tags:    

Similar News