SSMB29: మహేష్ పోస్టర్‌పై భారీ అంచనాలు!
SSMB29: సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న గ్లోబ్ ట్రాటర్ సినిమాపై అభిమానుల్లో ఎగ్జైట్‌మెంట్ నెలకొన్నది.
SSMB29: సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న గ్లోబ్ ట్రాటర్ సినిమాపై అభిమానుల్లో ఎగ్జైట్‌మెంట్ నెలకొన్నది. ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. పాత్రల పేర్లతో పోస్టర్లు ఆకర్షణీయంగా విడుదలవుతున్నాయి. మహేష్ పోస్టర్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇండియన్ సినిమాను కదిలిస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్ గ్లోబ్ ట్రాటర్. సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా, దిగ్గజ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ సంచలనంగా నిలుస్తోంది. పవర్‌ఫుల్ పాత్రల పేర్లను రివీల్ చేస్తూ విడుదలవుతున్న పోస్టర్లు అద్భుతంగా ఉంటున్నాయి. కుంభ గా పృథ్వి రాజ్, మందాకినిగా ప్రియాంక చోప్రా పోస్టర్లు రిలీజ్ చేశాకా సోషల్ మీడియా అంతా షేక్ అయ్యింది. ఇప్పుడు మహేష్‌బాబు పోస్టర్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆయన క్యారెక్టర్ ఏంటి? ఆయన లుక్ ఎలా ఉంటుంది? అనేదానిపై ఆసక్తి నెలకొంది.
రాజమౌళి విజన్, మహేష్ డైనమిక్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందనే ఆసక్తి ఆకాశాన్నంటుతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నవంబర్ 15న గ్రాండ్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఉంటాయని తెలుస్తోంది. మహేష్ పోస్టర్ రిలీజ్‌తో అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.