RRR Movie : 'ఆర్‌ఆర్‌ఆర్‌'ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. నెగిటివ్ క్లైమాక్స్

RRR Movie Climax: తెలుగు సినిమా క్లైమాక్స్‌లో హీరో చనిపోతేనో, లేక నెగిటివ్ ఎండింగ్ ఉంటే ఆ మూవీని ప్రేక్షకులు ఆదరించరని ఎప్పటి నుంచో ఓ అభిప్రాయం ఉండేది.

Update: 2021-03-08 06:08 GMT

ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫైల్ ఫోటో (TheHansIndia)

RRR Movie Climax : తెలుగు సినిమా క్లైమాక్స్‌లో హీరో చనిపోతేనో, లేక నెగిటివ్ ఎండింగ్ ఉంటే ఆ మూవీని ప్రేక్షకులు ఆదరించరని ఎప్పటి నుంచో ఓ అభిప్రాయం ఉండేది. కొందరూ కొన్ని సినిమాలు పేర్లుతో సహా ఉదాహరణలు చెప్పేవారు. అప్పుడేప్పుడో వచ్చిన గీతాంజలి, ప్రేమాభిషేకం లాంటి ఒకటో రెండో చిత్రాలు తప్ప ఏవీ సక్సెస్ కాలేదని బల్లగుద్ది మరి చెప్పేవారు. అయితే ఈతరం ప్రేక్షకుల అభిమతం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కథలో బలంలో ఉండాలేగాని ఎలాంటి చిత్రాలనైనా ఆదరిస్తామని నిరుపిస్తున్నారు. ఇటీవలే విడుదలైనా చిత్రంలో ప్రాణాలు విడిచిన హీరో స్టోరీ 'కలర్‌ ఫొటో'ను, ఇక నెగిటివ్ ఎండింగ్ ఉన్న 'ఉప్పెన' సినిమాను పెద్ద హిట్‌ చేయడమే ఇందుకు ఉదాహరణ.

అయితే దర్శకధీరుడు రాజమౌళి కూడా ఆర్ఆర్ఆర్ సినిమా క్లైమాక్స్‌ను నెగెటివ్ ఎండింగ్ ప్లాన్ చేసినట్లు తెలుగుస్తోంది. ఈ సినిమా రామ్ చరణ‌్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమురం భీమ్‌‌గా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ చివరి క్లైమాక్స్ బ్రిటీష్‌ వాళ్లతో పోరాటాలు చేస్తారు. ఈ సన్నీవేశాలను రాజమౌళి విభిన్నంగా తెరకెక్కిస్తారని ప్రచారం జరుగుతుంది.

రాజమౌళి తెరకెక్కించిన పతాక సన్నివేశాల్లో కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజుల్లో ఒకరికి కళ్లు పోతే, మరొకరికి కాళ్లు ప్రచారం జరుగుతోంది. అయినప్పటికీ వీరిద్దరూ శత్రువులతో భీకరంగా పోరాడేందుకు ముందడుగు వేస్తారని సమాచారం. కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజులు ఈ సన్నివేశాల్లో కాళ్లు కోల్పోయిన హీరోని, రెండో హీరో తన భుజాలపై ఎత్తుకోని శత్రువుపై విజృంభిస్తారని తెలుస్తోంది.

ఆర్‌ఆర్‌ఆర్‌లో ఇదే క్లైమాక్స్‌ ఉండబోతుందా? లేదా ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా? అనేది తెలియాలంటే అక్టోబర్‌ 13 వరకు వేచిచూడక తప్పదు. ఫ్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ , అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 

Tags:    

Similar News