kala Bhairava: బర్త్ డే రోజు భయపెట్టిస్తోన్న రాఘవ లారెన్స్

Update: 2024-10-29 15:40 GMT

kalabhairava first look poster: రాఘవ లారెన్స్ మల్టీ టాలెంటెడ్ స్టార్. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, కొరియోగ్రాఫర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు లారెన్స్. తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. లారెన్స్ బర్త్‌డే సందర్భంగా కొందరు మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చి వారికి అండగా నిలిచారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతలో పోస్ట్ చేశారు. అది చూసిన నెటిజన్స్ రాఘవ లారెన్స్‌పై ప్రశంసలు కురిపిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న దానికి నిదర్శనం రాఘవ లారెన్స్ అని కితాబిస్తున్నారు. అనేక సినిమాల్లో నటించిన ఆయన తెరపైనే కాదు నిజ జీవితంలోనూ సూపర్ హీరోనే అని అభిమానులు కాంప్లిమెంట్స్ గుప్పిస్తున్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సామాజిక సేవ చేయడంలోనూ లారెన్స్ ముందుంటారని గుర్తుచేసుకుంటున్నారు.

ఇప్పటికే లారెన్స్ ఫౌండేషన్ మాత్రం ద్వారా పేదలు, రైతులకు సాయం అందిస్తున్నారు. పలువురు వికలాంగులకు త్రీవీలర్స్ , అలాగే రైతులకు అవసరమైన ట్రాక్టర్స్ అందజేశారు. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేస్తూ వారికి అండగా నిలుస్తుంటారు అనే పేరు సంపాదించుకున్నారు.

ఇక లారెన్స్ హీరోగా, రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కుతోంది. ఇవాళ లారెన్స్ బర్త్ డే కావడంతో 25 వ చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పాన్ ఇండియా సూపర్ హీరో చిత్రంగా వస్తోన్న కాల భైరవ పోస్టర్ అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. లారెన్స్ గంభీరమైన లుక్ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Tags:    

Similar News