Rag Mayur: టాలీవువడ్‌కి పరిచయమైన మరో విలక్షణ నటుడు.. ఒక్క సినిమాతోనే భారీ క్రేజ్‌

Rag Mayur: సినిమా బండితో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాగ్ మయూర్‌ తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించాడు.

Update: 2025-02-03 03:00 GMT

Rag Mayur: టాలీవువడ్‌కి పరిచయమైన మరో విలక్షణ నటుడు.. ఒక్క సినిమాతోనే భారీ క్రేజ్‌

Rag Mayur: సినిమాల్లో హీరోకు ఎంత క్రేజ్‌ ఉంటుందో కొందరు విలన్స్‌కి కూడా అంతే క్రేజ్‌ ఉంటుంది. విలన్‌ పాత్ర ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే హీరో పాత్ర అంత హైలెట్‌ అవుతుందని చాలా మంది దర్శకులు భావిస్తుంటారు. అందుకే బలమైన విలన్‌ పాత్రలను రాసుకుంటారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఎంతో మంది విలన్స్‌ తమ అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించారు. అయితే తాజాగా ఈ జాబితాలోకి మరో కొత్త విలన్‌ వచ్చి చేరారు.

సినిమా బండితో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాగ్ మయూర్‌ తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమాలో విలన్‌గా నటించి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘సివరపల్లి’ అనే వెబ్ సిరీస్‌లో కూడా కనిపించిన రాగ్‌ మయూర్‌ తన నటనతో మెస్మరైజ్‌ చేశారు. ఈ సినిమాలో రాగ్‌ హీరో పాత్రలో నటించాడు. అమెరికా వెళ్లాల్సిన ఓ ఇంజనీర్‌ స్టూడెంట్ పంచాయతీ సెక్రటరీగా మారి, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడన్న పాత్రలో మంచి నటనను కనబరిచాడు.

కాగా గాంధీ తాత చెట్టు అనే సినిమాలో కూడా నటించాడు రాగ్‌. సుకుమార్ కుమార్తె సుకృతి ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు సినిమాలో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఏజెంట్గా సతీష్ అనే పాత్రలో రాగ్ మయూర్ అలరించాడు. ఈ పాత్రలో రాగ్‌ మయూర్‌ చాలా నేచురల్‌గా నటించాడు. నిజానికి అతనికి ఈ సినిమాలో ఉన్న స్క్రీన్ టైం తక్కువే అయినా తనదైన శైలిలో ఉన్న కాసేపు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్‌లో తన అద్బుత నటనతో మెప్పించాడు.

ఒకేరోజు విడుదలైన గాంధీతాత చెట్టు, సివరపల్లి వెబ్‌ సిరీస్‌ రెండింటికీ మంచి టాక్‌ వచ్చింది. అన్ని రివ్యూల్లోనూ రాగ్ మయూర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇలా భిన్నమైన పాత్రలు చేస్తూ తెలుగులో ఒక మంచి నటుడిగా స్థిరపడాలని భావిస్తున్న రాగ్ మయూర్ ఇప్పటికే గీత ఆర్ట్స్2 లో ఒక పేరు పెట్టని సినిమాతో పాటు పరదా, అలాగే గరివిడి లక్ష్మి సినిమాలో కూడా నటిస్తున్నాడు.

Tags:    

Similar News