Pushpa 2 Ticket Prices Drop: తగ్గిన పుష్ప 2 టికెట్ ధరలు.. ఎంతంటే..?

Pushpa 2 Ticket Prices Drop: పుష్ప2 సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తోంది.

Update: 2024-12-09 07:17 GMT

Pushpa 2 Ticket Prices Drop: తగ్గిన పుష్ప 2 టికెట్ ధరలు.. ఎంతంటే..?

Pushpa 2 Ticket Prices Drop: పుష్ప2 సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.621 కోట్లు వసూలు చేసినట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే సోమవారం నుంచి సామాన్యులకు టికెట్ ధరలు అందుబాటులోకి రానున్నాయి. ప్రీమియర్ షోకు రూ.800 టికెట్ ధర వసూలు చేశారు.

డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.105, మల్టీఫ్లెక్స్ లో రూ.150 పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నైజాంలో పెంచిన ధరతో పోలిస్తే టికెట్ ధరలు ఇంకాస్త తగ్గినట్టు బుక్ మై షోలో చూపిస్తోంది. ఇక సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.200, ఫస్ట్ క్లాస్ రూ.140, సెకండ్ క్లాస్ రూ.80, ఉండగా, మల్టీ ప్లెక్స్ లో రూ.395 చూపిస్తోంది. ధరల తగ్గింపుతో మరింత మంది ప్రేక్షకులు థియేటర్ కు వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు ఇప్పటి వరకు ఏ హిందీ మూవీ సాధించని రికార్డును పుష్ప2 సాధించింది. ఇక నార్త్ అమెరికాలో ఏకంగా 8.03 మిలియన్ డాలర్లు రాబట్టింది. తగ్గిన ధరలతో థియేటర్లకు సినీ ప్రియులు భారీగా వచ్చే అవకాశం ఉంది. అయితే తగ్గిన టికెట్ ధరలతో ఈ వీకెండ్ ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి మరి.

Tags:    

Similar News