Yento Antha Sarikothaga: పూరి చేతుల మీదుగా ‘ఏంటో అంతా సరికొత్తగా’ ఫస్ట్ లుక్ విడుదల

Yento Antha Sarikothaga: ప్రేమ కథా చిత్రాలు ఎప్పుడూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించేలా గ్రామీణ వాతావరణంలో అందమైన ప్రేమ కథలు వచ్చి చాలా రోజులైంది.

Update: 2025-10-31 06:49 GMT

పూరి చేతుల మీదుగా ‘ఏంటో అంతా సరికొత్తగా’ ఫస్ట్ లుక్ విడుదల

Yento Antha Sarikothaga: ప్రేమ కథా చిత్రాలు ఎప్పుడూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించేలా గ్రామీణ వాతావరణంలో అందమైన ప్రేమ కథలు వచ్చి చాలా రోజులైంది. ఈ లోటును భర్తీ చేసేందుకు వస్తోంది ‘ఏంటో అంతా సరికొత్తగా’ చిత్రం.

రాము ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాము.ఎం నిర్మాతగా, రాజ్ బోను దర్శకత్వంలో ఈ అందమైన గ్రామీణ ప్రేమ కథా చిత్రం రూపుదిద్దుకుంది. ఇందులో శ్రీరామ్ నిమ్మల, హర్షిత జంటగా నటించారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురువారం నాడు విడుదల చేశారు. టైటిల్‌కు తగ్గట్టుగానే పోస్టర్ చాలా కూల్‌గా, ఆహ్లాదకరమైన ఫీల్‌ను ఇస్తుండగా, సినిమా బ్యాక్‌డ్రాప్ కూడా సరికొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.

‘ఏంటో అంతా సరికొత్తగా’ చిత్రంలో హీరో, అతని స్నేహితులు టోల్ గేట్ వద్ద పని చేస్తుంటారు. గ్రామీణ వాతావరణం, టోల్ గేట్ వద్ద జరిగే సంఘటనలను ప్రధానంగా చూపిస్తూ, వాటి నేపథ్యంతోనే అందమైన ప్రేమ కథను తెరపైకి తీసుకురానున్నారు.

పల్లెటూరి వాతావరణం, ప్రశాంతత, అన్నీ రకాల భావోద్వేగ అంశాలను జోడించి ఈ సినిమాను ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. త్వరలోనే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని, సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు.

Tags:    

Similar News