Devi Sri Prasad: దేవిశ్రీతో రహస్య వివాహం.. హీరోయిన్ రియాక్షన్ ఏంటంటే?
Devi Sri Prasad: మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తో తన పెళ్లి సీక్రెట్ గా జరిగిందంటూ వస్తున్న కథనాలను నటి పూజిత పొన్నాడ ఖండించింది.
Devi Sri Prasad: దేవిశ్రీతో రహస్య వివాహం.. హీరోయిన్ రియాక్షన్ ఏంటంటే?
Devi Sri Prasad: మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తో తన పెళ్లి సీక్రెట్ గా జరిగిందంటూ వస్తున్న కథనాలను నటి పూజిత పొన్నాడ ఖండించింది. దేవి శ్రీ ప్రసాద్ తోనే కాదు.. తనకు ఎవరితోనూ రిలేషిన్ షిప్ లేనని స్పష్టం చేసింది. ఇలాంటి కథనాలు ఎలా పుట్టిస్తారో అర్థం కాదని పూజిత పొన్నాడ వాపోయింది. దేవి శ్రీ ప్రసాద్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ప్రస్తుతానికి నేను సింగిల్ అని ఆమె తెలిపారు.
సోషల్‌మీడియాలో కొన్నిసార్లు తనపై నెగెటివ్ కామెంట్స్ వస్తుంటాయని.. వాటిని చూసినప్పుడు బాధగా అనిపిస్తుందని ఆమె అన్నారు. తప్పుడు కథనాలు ప్రచారం చేయొద్దంటూ హితవు పలికింది. ఇక, విశాఖకు చెందిన పూజిత 'ఊపిరి'తో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇందులో ఆమె చిన్న పాత్ర పోషించారు. ఆకాశ వీధుల్లో సినిమాతో పాటు రవితేజ రావణాసుర, పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నది.