Allu Aravind On OTT vs Theater : ఓటీటీ జోరు మాత్రం తగ్గదు : అల్లు అరవింద్

Allu Aravind On OTT vs Theater : కరోనా ప్రభావం ప్రతి ఒక్కరంగం పైన పడింది.. అందులో సినిమా ఇండస్ట్రీ ఒకటి.. దీనివలన సినిమా షూటింగ్

Update: 2020-08-14 07:59 GMT
Allu Aravind (File Photo)

Allu Aravind On OTT vs Theater : కరోనా ప్రభావం ప్రతి ఒక్కరంగం పైన పడింది.. అందులో సినిమా ఇండస్ట్రీ ఒకటి.. దీనివలన సినిమా షూటింగ్ లు మాత్రమే కాదు.. ధియెటర్లు కూడా బంద్ అయిపోయయాయి.. ప్రస్తుతానికి షూటింగ్ లకి అయితే అనుమతి అయితే లభించింది కానీ ధియెటర్లు ఇంకా ఓపెన్ కాలేదు.. దీనితో చిత్ర నిర్మాతలు ఓటీటీ బాట పడుతున్నారు. ఇప్పటికే చాలా చిత్రాలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ద్వారా విడుదలయ్యాయి.. అయితే ధియేటర్లు ఒపెన్ అయితే థియేటర్లపై ఓటీటీ ప్రభావం ఎలా ఉండబోతుంది అన్నది అసలు ప్రశ్న.. కొందరు ధియేటర్ ఓటీటీ ఏమీ చేయలేదు అని అంటే.. ఓటీటీ ప్రభావం ధియేటర్ పైన అంతో ఇంతో పడుతుందని అంటున్నారు.

అయితే తాజాగా దీనిపైన ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు.. ధియేటర్లు బంద్ అయిపోవడంతో అయన ఆహా యాప్‌ ని ప్రారభించిన సంగతి తెలిసిందే.. ఈ ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా ఇప్పటికే చాలా సినిమాలు విడుదలయ్యాయి. ఈ ఆహా యాప్‌కు మంచి స్పందన వస్తుందని అయన అన్నారు.. ఇప్పటికే 40 లక్షల డౌన్‌లోడ్లు అయినట్లుగా ఆయన వెల్లడించారు. కొత్త కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, ప్రత్యేకమైన షోలని తీసుకువస్తామని అన్నారు.

థియేటర్లు తెరుచుకున్నాక నిర్మాతగా మీరు ఓటీటీ వైపు చూడటం తగ్గిస్తారా అన్న ప్రశ్నకి అయన స్పందిస్తూ.. అదేమీ లేదని టీటీ ప్రజలకు బాగా చేరువైపోయిందని, ఇప్పటికే మా యాప్‌ కోసం చాలా షోలు సిద్ధం చేస్తున్నామని, కొన్ని చర్చల దశలో ఉన్నట్టుగా ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో ఓటీటీ, థియేటర్‌లు సమాంతరంగా నడుస్తాయని అన్నారు.  

Tags:    

Similar News