SSMB 29: రాజమౌళి సినిమా కోసం ప్రియాంక భారీ పారితోషికం.. ఎన్ని కోట్లంటే..?
రాజమౌళి.. ఇప్పుడు అందరి దృష్టి ఆయన తీయబోయే నెక్స్ట్ సినిమాపైనే ఉంది. మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయే సినిమాకు తాత్కాలికంగా SSMB29 అని పేరు పెట్టారు.
రాజమౌళి సినిమా కోసం ప్రియాంక భారీ పారితోషికం.. ఎన్ని కోట్లంటే..?
SSMB 29: రాజమౌళి.. ఇప్పుడు అందరి దృష్టి ఆయన తీయబోయే నెక్స్ట్ సినిమాపైనే ఉంది. మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయే సినిమాకు తాత్కాలికంగా SSMB29 అని పేరు పెట్టారు. ఇప్పటికే ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్నారని సమాచారం. అయితే ఈ సినిమా కోసం ప్రియాంక ఎంత పారితోషికం తీసుకుంటున్నారనేది ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది.
రాజమౌళి భారీ బడ్జెట్‌తో SSMB29ను చిత్రీకరిస్తున్నారు. అందుకే పక్కా ప్లాన్‌తో ప్రియాంకను ఓకే చేసినట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఇంత భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్న ప్రియాంక పారితోషికం పై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు ఆమె ఎంత పారితోషికం తీసుకోబోతున్నారంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాకు ప్రియాంక దాదాపు రూ.30 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ కోసం ప్రియాంక సుమారు రూ.50 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని.. సుదీర్ఘ చర్చల తర్వాత రూ.30 కోట్లకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
ఒకవేళ ఇదే నిజమైతే భారతీయ సినిమాల్లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకోబోతున్న కథనాయికగా ప్రియాంక చోప్రా రికార్డ్ సృష్టించబోతున్నారంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్. మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా కావడంతో ప్రియాంకకు ఇంత పెద్ద మొత్తంలో చెల్లించేందుకు నిర్మాతలు సిద్దమయినట్టు సమాచారం. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను వివాహం చేసుకుని అమెరికాలో సెటిల్ అయిన ప్రియాంక.. మహేష్ సినిమా కోసం ఇటీవల హైదరాబాద్ కు వచ్చారు. ఇప్పుడు హాలీవుడ్ లో ప్రియాంకకు డిమాండ్ ఉంది. టాలీవుడ్ సినిమాలో నటిస్తే ఈ సినిమాకు కూడా ప్రపంచ స్థాయిలో హైప్ వస్తుందని.. అందుకే భారీ పారితోషికం డిమాండ్ చేసినప్పటికీ ఆమెను తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ కథాంశంతో రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు బాగానే కష్టపడుతున్నారు. సినిమా కోసం అతని గెటప్ కూడా కొత్తగా ఉండనుందని తెలుస్తోంది. అయితే షూటింగ్ జరుగుతున్నప్పటికీ ఎలాంటి విషయాలు బయటకు రాకుండా రాజమౌళి గోప్యంగా ఉంచుతున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా.. ఎంఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.