Pradeep Ranganathan: పాన్ ఇండియా మూవీతో వ‌స్తున్న ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌.. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో

Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్ వరుస విజయాలతో దూసుకెళ్తున్న యంగ్ హీరో. ఇప్పుడు ఆయన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు.

Update: 2025-05-11 10:44 GMT

Pradeep Ranganathan: పాన్ ఇండియా మూవీతో వ‌స్తున్న ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌.. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో

Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్ వరుస విజయాలతో దూసుకెళ్తున్న యంగ్ హీరో. ఇప్పుడు ఆయన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. డ్యూడ్ టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ద్వారా కీర్తిశ్వరన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సినిమాలో ప్రదీప్ జోడీగా ప్రేమ‌లు మూవీ ఫేమ్ మమిత బైజు నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ప్రదీప్ ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు మేకర్స్, మమిత బైజు లుక్‌ను కూడా విడుదల చేశారు. పోస్టర్‌లో ఇద్దరూ కూల్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ప్రదీప్ నవ్వుతూ కనిపిస్తే, మమిత ట్రెండీ దుస్తులు, షేడ్స్‌తో ఫ్యాషన్ స్టేట్‌మెంట్ ఇస్తోంది.

ఈ చిత్రంలో సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే రోహిణి మోలెట్టి, హృతు హరూన్, ద్రవిడ్ సెల్వం వంటి నటులు కూడా ఇందులో భాగమవుతున్నారు. ఇక ఈ సినిమాకు సంగీతాన్ని సాయి అభ్యంకర్ అందిస్తుండ‌గా నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ప్రొడక్షన్ డిజైనర్: లతా నాయుడు, ఎడిటర్: బరత్ విక్రమన్, కాస్ట్యూమ్స్: పూర్ణిమ రామస్వామి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. దీపావళి సందర్భంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనే లక్ష్యంతో టీమ్ పనిచేస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Tags:    

Similar News