Prabhas: రాజాసాబ్: జియో హాట్‌స్టార్‌ ఫ్యాన్సీ ఆఫర్?

Prabhas: ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ ఓటీటీ హక్కుల సస్పెన్స్ వీడింది.

Update: 2025-12-08 09:25 GMT

Prabhas: ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ ఓటీటీ హక్కుల సస్పెన్స్ వీడింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ మధ్య పోటీ ఉన్నప్పటికీ జియో హాట్‌స్టార్ ఈ హక్కులు సాధించింది. పాన్ ఇండియా డిజిటల్ హక్కులకు 170 కోట్లకు పైగా చెల్లించినట్టు సమాచారం. వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ తర్వాత జియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ది రాజాసాబ్ సినిమా ఓటీటీ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ మధ్య తీవ్ర పోటీ నడిచింది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జియో హాట్‌స్టార్ ఈ హక్కులను తన కైవసం చేసుకుంది. పాన్ ఇండియా భాషల డిజిటల్ హక్కులకు 170 కోట్లకు పైగా భారీ మొత్తం చెల్లించినట్టు సమాచారం.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ తెరకెక్కిస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 9న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

Tags:    

Similar News