Prabhas: ‘స్పిరిట్’.. ప్రభాస్ లుక్ లాక్..?
Prabhas: ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ చిత్రం లుక్ టెస్ట్ పూర్తయింది.
Prabhas: ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ చిత్రం లుక్ టెస్ట్ పూర్తయింది. మూడు భిన్న లుక్స్ లాక్ చేశారట. డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలు కానుంది.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’లో ప్రభాస్ లుక్ టెస్ట్ పూర్తయింది. ప్రభాస్ నివాసంలోనే జరిగిన ఈ టెస్ట్‌లో మూడు పవర్‌ఫుల్ లుక్స్‌ను టీమ్ లాక్ చేసినట్టు సమాచారం. ఈ మూడింటిలో ఒకటి ఫైనల్ అవుతుందా లేక అన్నీ వాడతారా అనేది ఇంకా స్పష్టత రాలేదు. హీరోయిన్‌గా తృప్తి డిమ్రిని ఖరారు చేసిన సందీప్ వంగా డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభిస్తామని ఇటీవలే ప్రకటించారు. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ లుక్‌ను ఎలా మెయింటైన్ చేస్తారనే చర్చ కూడా సాగుతోంది. మొత్తం మీద ‘స్పిరిట్’ సెట్స్ పైకి వెళ్లేందుకు అన్ని అడ్డంకులు తొలగినట్టు కనిపిస్తోంది.