Raja Saab: 'రాజాసాబ్' రిలీజ్ డేట్, టీజర్‌పై కీలక అప్‌డేట్
Raja Saab Release Date: చిత్ర బృందం ప్రకారం, ‘రాజాసాబ్’ చిత్రాన్ని డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
Raja Saab: 'రాజాసాబ్' రిలీజ్ డేట్, టీజర్‌పై కీలక అప్‌డేట్
Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘రాజాసాబ్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. అయితే షూటింగ్ ఆలస్యం, విడుదల తేది వాయిదా పడుతూ రావడంతో అభిమానుల్లో నిరాశ కనిపించింది. కానీ తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ కీలక అప్‌డేట్‌ను విడుదల చేశారు.
చిత్ర బృందం ప్రకారం, ‘రాజాసాబ్’ చిత్రాన్ని డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అలాగే టీజర్‌ను ఈ నెల 16న ఉదయం 10:52 గంటలకు విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ఒక ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు, అది సోషల్ మీడియాలో మంచి స్పందన పొందుతోంది.
ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే యువ కథానాయిక రిద్ధి కుమార్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఇక బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో ప్రభాస్‌కు తాతగా కీలక పాత్రలో నటిస్తున్నారు. వీరి మధ్య ఉండే సన్నివేశాలు సినిమా హైలైట్‌గా నిలుస్తాయని చిత్రయూనిట్ చెబుతోంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతాన్ని థమన్ అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’, అలాగే ‘సలార్-2’, ‘కల్కి-2’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అయినా సరే, ‘రాజాసాబ్’ ప్రభాస్ కెరీర్లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో డార్లింగ్ అభిమానులు ఈ సినిమా టీజర్, విడుదల తేదీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.