Kalki First Day Collection: కల్కి కలెక్షన్ల ఊచకోత.. మొదటి రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా.?
Kalki First Day Collection: ఎన్నో అంచనాల నడుమ విడుదలైన కల్కి 2898 ఏడి సినిమా చరిత్రను తిరగరాస్తోంది.
Kalki First Day Collection: కల్కి కలెక్షన్ల ఊచకోత.. మొదటి రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా.?
Kalki First Day Collection: ఎన్నో అంచనాల నడుమ విడుదలైన కల్కి 2898 ఏడి సినిమా చరిత్రను తిరగరాస్తోంది. అంచనాలకు అనుగుణంగానే ఈ సినిమా భారీ సక్సెస్ దిశగా దూసుకుపోతోంది. విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో ఈ సినిమా దూసుకుపోతోంది. ఇండియాతో పాటు ఓవర్‌సీస్ మార్కెట్లో కూడా కల్కి ప్రభంజనం కొనసాగుతోంది.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, ప్రభాస్ హీరోగా సుమారురూ. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు కలెక్షన్ల సుమాని సృష్టిస్తోంది. భారతీయ సినిమాల్లో మూడవ అతిపెద్ద ఓపెనింగ్‌గా ఈ సినిమా సరికొత్త చరిత్ర సృష్టించింది. కల్కి మూవీ తొలి రోజు సుమారు రూ. 95 కోట్ల వసూలు చేసినట్లు తెలుస్తోంది. గ్రాస్ కలెక్షన్స్ ప్రకారం దాదాపు రూ.118 కోట్లు అని టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ సినిమా ఏకంగా రూ. 180 కోట్ల కలెక్షన్స్ రాగా.. అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడవ చిత్రంగా నిలిచిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే ట్రిపులార్ సినిమా మొదటి రోజే ఏకంగా రూ.223 కోట్లు రాబట్టి మొదటి స్థానంలో నిలవగా.. బాహుబలి 2 ఫస్ట్ డే రూ.217 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక తర్వాత ఇప్పుడు కల్కి ప్రాజెక్ట్ రూ.180 కోట్లతో మూడవ స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పోటీగా ఎలాంటి సినిమాలు లేకపోవడం, వీకెండ్ కావడంతో కల్కి కలెక్షన్ల జోరు కచ్చితంగా కొనసాగడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందూలోనూ సిమిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు పెరగడం ఖాయమని భావిస్తున్నారు.