Prabhas: కల్కి2పై లేటెస్ట్ అప్‌డేట్.. షూటింగ్ ఎప్పటి నుంచంటే
Kalki 2 update: ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రభాస్ కెరీర్ బిజీగా మారింది. ఈ జాబితాలో కల్కి2 కూడా ఉంది. ‘కల్కి 2898 AD’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో, ఇప్పుడు దీనికి సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్.
Kalki 2 update: ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రభాస్ కెరీర్ బిజీగా మారింది. ఈ జాబితాలో కల్కి2 కూడా ఉంది. ‘కల్కి 2898 AD’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో, ఇప్పుడు దీనికి సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ప్రస్తుతం ఆయన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉండగా, సీక్వెల్ షూటింగ్ మే మధ్యలో ప్రారంభం కానుందన్న టాక్ వినిపిస్తోంది.
ఇటీవల అమితాబ్ బచ్చన్ కూడా ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో పూర్తి చేసిన తర్వాత ‘కల్కి 2’ షూటింగ్‌లో పాల్గొంటానని తెలిపారు. మేలో ప్రారంభమయ్యే ఈ క్రేజీ సీక్వెల్ షూటింగ్, జూన్ 15 వరకు షెడ్యూల్ కొనసాగనుందని సమాచారం. ఇదిలా ఉంటే కల్కి సీక్వెల్‌కు సంబంధించి ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ పూర్తి చేసినట్లు చిత్ర యూనిట్ ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు సుమారు 35 శాతం షూటింగ్ జరిగిందని మేకర్స్ తెలిపారు. కాగా మిగతా భాగాన్ని ఈ ఏడాదిలోనే పూర్తి చేసే అవకాశముందని తెలుస్తోంది.
కథలో సుమతి (దీపికా పదుకొణె)ను అపహరించడంతో, ఆమెను రక్షించేందుకు అశ్వత్థామ భైరవ/కర్ణ (ప్రభాస్) రంగంలోకి దిగతారు. ఈ సీన్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి అభిమానుల్లో ఎక్కువైపోయింది. కమాండర్ యాస్కిన్ పాత్రలో కనిపించిన కమల్ హాసన్ పాత్ర రెండో పార్ట్‌లో ఎక్కువ నిడివి ఉండనుందని సమాచారం. అలాగే, అమితాబ్ బచ్చన్ పోషించిన ‘అశ్వత్థామ’ పాత్ర సీక్వెల్‌లో మరింత పవర్‌ఫుల్‌గా ఉండనుందని సమాచారం.
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ‘కల్కి’ సినిమాలో దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, శోభన, బ్రహ్మానందం, పశుపతి, అన్నా బెన్, కావ్యా రామ చంద్రన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. మరి పార్ట్ 2 ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.