Project K: ప్రభాస్ కొత్త మూవీ ప్రాజెక్టు Kకి లీకుల సమస్య

Project K: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో నాగ్ అశ్విన్ తీస్తున్న మూవీ ప్రాజెక్ట్ కే.

Update: 2023-04-06 12:30 GMT

Project K: ప్రభాస్ కొత్త మూవీ ప్రాజెక్టు Kకి లీకుల సమస్య

Project K: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో నాగ్ అశ్విన్ తీస్తున్న మూవీ ప్రాజెక్ట్ కే. ఇక కే అంటే కల్కీ అన్నారు. కానే కాదు కృష్ణ లేదంటే కర్ణా అని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. ఇప్పుడు కాళ భైరవ అంటున్నారు. ఇంతకి ఏది నిజం..? ఎందుకి ఈ టైటిల్ ఇంత రహస్యం.. అన్నీంటికి మించి కంటెంట్ కేవలం సైఫై మూవీ మాత్రమే కాదా...?

ప్రభాస్ ప్రజెంట్ రకరకాల దేవుళ్ల అవతారాలతో బిజీ అయ్యాడు. ప్రాజెక్ట్ కేలో అయితే ఏకంగా ముగ్గురు దేవుళ్లంటున్నారు. కే అంటే కల్కీ అని కాదు క్రిష్ణుడని, కానే కాదు కర్ణుడని ప్రచారం జరుగుతోంది. ఈలోపు కాళ భైరవ అనేపేరు సీన్ లోకి వచ్చింది. రాధేశ్యామ్ మూవీ టైంలో కృష్ణుడి అంశగా ప్రభాస్ వస్తున్నాడనే ప్రచారం జరిగింది. టీజర్ కూడా అలాంటి స్పెక్కులేషన్ కే దారితీసింది. కాని తనో పాలమిస్ట్ అని తేలటంతో లెక్క మారింది. ఏదేమైనా ప్రభాస్ ఇప్పుడు నార్మల్ హీరో నుంచి సూపర్ హీరో స్థాయికి చేరాడు.

బాహుబలితోనే సూపర్ హీరో రేంజ్‌ని చేరిన ప్రభాస్ ఏం చేసినా, ఆపాత్ర స్థాయి పెరుగుతోంది. హిట్ ఫ్లాప్ ని మించేలా ప్రభాస్ ఇమేజ్, క్రేజ్ పెరిగింది. అందుకు తగ్గ స్థాయి ఉన్న కథలంటే ఇక పురాణాలే అనే అభిప్రాయం పెరిగిందా?

మిర్చీలో ఫైట్స్ తో దుమ్ముదులిపిన ప్రభాస్, బాహుబలిగా మారి సూపర్ హీరో అయ్యాడు. రాధేశ్యామ్ ఆడకున్నా ప్రభాస్ స్టామినా ఏంటో తేల్చింది. ఇప్పుడు ఒక్కో దేవుడి అవతారం ఎత్తి తను సినిమా దేవుడిగా మారుతున్నాడు. ఆదిపురుష్ లో శ్రీరాముడిగా కనిపించనున్న ప్రభాస్, ప్రాజెక్ట్ కేలో కల్కిగా కనిపిస్తాడన్నారు. కాదు క్రిష్ణుడు కానే కాదు కర్ణుడు అంటూ ప్రచారం చేస్తున్నారు లేటెస్ట్ గా కాళ భైరవ పేరునే కే గా వాడుతున్నారనే కొత్త ప్రచారం షురూ అయ్యింది. 

Tags:    

Similar News