Prabhas Adipurush : 'ఆదిపురుష్' లో ప్రభాస్ పాత్ర పై క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్!

Prabhas Adipurush : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.. 'ఆదిపురుష్' అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తూ మరో పాన్ ఇండియా

Update: 2020-08-18 04:56 GMT
Prabhas, Nag Ashwin (File Photo)

Prabhas Adipurush : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.. 'ఆదిపురుష్' అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తూ మరో పాన్ ఇండియా మూవీని చేస్తున్నాడు ప్రభాస్... ఈ సినిమాకి 'తానాజీ' ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.. ఈ సినిమాకు టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ ద్వారా ఈ మూవీ చారిత్రక నేపథ్యంలో భారీ ఎత్తున రూపొందనుందని సమాచారం.. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు.. అయితే, దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ దీనిపైన మహానటి ఫేం నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు.. ఈ సినిమా ఫస్ట్ లుక్ పైన ట్విట్టర్ వేదికగా స్పందించిన నాగ్ అశ్విన్.. " ప్రభాస్ గారిని శ్రీరాముడిగా చూడటానికి చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. వెండితెరపై గతంలో చాలా కొద్ది మంది నటులు మాత్రమే రాముడి పాత్ర పోషించారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు" అని తెలియజేశారు నాగ్ అశ్విన్... దీనితో ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడని అర్ధం అయిపొయింది.

అటు ప్రభాస్ 21వ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వినీదత్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ కే రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' మూవీ చేస్తున్నాడు.

Tags:    

Similar News