Prabhas 22 Update: 'ఆది పురుషుడు' అవుతున్న బాహుబలి.. ప్రభాస్ 22 సర్ప్రైజ్ టైటిల్!

Prabhas 22 Update: ఆది పురుషుడు అవుతున్న బాహుబలి.. ప్రభాస్ 22 సర్ప్రైజ్ టైటిల్!
x
Prabhas as Adipurush
Highlights

Prabhas 22 Update: ప్రస్తుతం ప్రభాస్ 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ' రాధేశ్యామ్' అనే లవ్ స్టొరీ చేస్తున్న విషయం తెలిసిందే.

Prabhas 22 Update: ప్రస్తుతం ప్రభాస్ 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ' రాధేశ్యామ్' అనే లవ్ స్టొరీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన తొలిసారి హీరొయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. తరువాత మహానటి ఫేం నాగ్ అశ్విన్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్‌ పై సీ అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సైన్స్ ఫిక్షన్ నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటికే హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొణేను తీసుకుంది చిత్రబృందం..

అయతే, ప్రభాస్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. 'తానాజీ' ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో మంగళవారం ఉదయం 7 గంటల 11 నిమిషాలకు 22 వ చిత్రం అయిన 'ఆదిపురుష్' అనే సినిమాలో నటిస్తున్నట్లు ప్రభాస్ ప్రకటించాడు.. ఈ సినిమా ప్రభాస్ సినిమాలకు కొంత భిన్నంగా ఉండనుందని ఆ పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. ఈ సినిమా ను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌ దర్శకత్వం వహించనుండగా.. టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమర్, కిషన్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హిస్టారికల్ మూవీ రామాయణంగా ఈ మూవీ ఉండనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రభాస్ చిత్ర టైటిల్ ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు. ప్యాన్ ఇండియా చిత్రంగా వస్తోన్న ఈ సినిమా మొత్తం 5 భాషల్లో హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళ భాషల్లో విడుదల కానుంది. ముఖ్యంగా ప్రధాన విలన్ పాత్ర మరియు ఈ మెగా ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌ సరసన హీరొయిన్ గా ఎవరు నటించనున్నారు. ఇతర నటీ నటుల వివరాలు తెలియాల్సి ఉంది.




Show Full Article
Print Article
Next Story
More Stories