Posani Krishna Murali: అశ్వినీదత్ నే కాదు సూపర్ స్టార్ రజనీని కూడా వదలని పోసాని..
Posani Krishna Murali: నంది అవార్డుల రచ్చ..అశ్వనిదత్‌పై పోసాని ఫైర్
Posani Krishna Murali: అశ్వినీదత్ నే కాదు సూపర్ స్టార్ రజనీని కూడా వదలని పోసాని..
Posani Krishna Murali: నంది అవార్డుల వ్యవహారం టాలీవుడ్ లో రాజకీయ దుమారం రేపుతోంది. ఓ ప్రెస్ మీట్ లో భాగంగా నంది అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోవడంపై స్పందిస్తూ అశ్వినీదత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీలో ఉత్తమ రౌడీలు, ఉత్తమ గూండాల సీజన్ నడుస్తోందంటూ...సినిమాలకు నంది అవార్డులు ఇవ్వాలంటే మరో రెండేళ్లు ఎదురుచూడక తప్పదంటూ నిర్మాత అశ్వినీదత్ వ్యాఖ్యానించారు.
వైసీపీ ప్రభుత్వమే టార్గెట్ గా అశ్వినీదత్ ఈ వ్యాఖ్యలు చేయడంతో ఏపీ ఫిలిమ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సీఎం జగన్ మీకు ఏం అన్యాయం చేశారని ప్రశ్నిస్తూ చంద్రబాబులా వెన్నుపోటు పొడిచారా అని పోసాని అడిగారు. ఉత్తమ వెన్నుపోటు, ఉత్తమ మోసగాడు అవార్డు మీకే ఇవ్వాలంటూ చురకలు వేశారు. ఉత్తమ సన్నాసుల అవార్డులు కూడా మీకే దక్కుతాయంటూ పరోక్షంగా టీడీపీ నేతల్ని ఉద్దేశిస్తూ పరోక్షంగా విమర్శించారు.
అలాగే పోసాని కృష్ణ మురళీ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు. రజనీకాంత్ రోజూ చెన్నై నుంచి విజయవాడకు వచ్చి చంద్రబాబును పొగిడితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని..ఆయన కేవలం తమిళ ప్రజలకు మాత్రమే సూపర్ స్టార్ అని...తెలుగువాళ్లకు చిరంజీవియే సూపర్ స్టార్ అంటూ వ్యాఖ్యానించారు. మొత్తంగా, పోసానీ వర్సెస్ అశ్వినీదత్ అన్నట్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.