Pooja Hegde: పూజా టాలీవుడ్‌కి అందుకే దూరమైందా.? అసలు కారణం తెలిస్తే..

Pooja Hegde: పూజా హెగ్డే.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు.

Update: 2025-03-02 12:01 GMT

Pooja Hegde: పూజా హెగ్డే.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఒకప్పటి స్టార్ హీరోయిన్‌గా తెలుగులో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఆమె, టాలీవుడ్ టాప్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖ నటులతో కలిసి వరుస విజయాలను అందుకుంది.

అయితే గత మూడు సంవత్సరాలుగా పూజా ఒక్క తెలుగు సినిమాలో కూడా కనిపించలేదు. దాంతో ఆమెకు టాలీవుడ్ నుంచి గ్యాప్ వచ్చినట్టేనా? అనే చర్చ నడుస్తోంది. ఇంతకీ పూజా టాలీవుడ్‌కి ఎందుకు దూరమైందన్న దానిపై చర్చ నడుస్తోంది. టాలీవుడ్‌ ఇండస్ట్రీ పూజపై పరోక్షంగా నిషేధం విధించిందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

పూజా హెగ్డే అధిక పారితోషికం, సెట్లో లగ్జరీ డిమాండ్స్ వల్లే టాలీవుడ్ నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇవ్వడం మానేశారని వార్తలు వస్తున్నాయి. గతంలో కొందరు నిర్మాతలు హీరోయిన్లు అత్యధిక రెమ్యునరేషన్ డిమాండ్ చేయడమే కాక, సెట్‌లో ప్రత్యేక వసతులు కోరడం వల్ల షూటింగ్ ఖర్చులు పెరిగిపోతున్నాయని వాపోయారు. వీరిలో పూజా పేరు కూడా ప్రధానంగా వినిపించింది.

టాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకున్న పూజా ప్రస్తుతం తమిళ, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. తమిళంలో సూర్యతో ‘రెట్రో’, రాఘవ లారెన్స్‌తో ‘కాంచన 4’, విజయ్‌తో ‘జన నాయగన్’, రజనీకాంత్‌తో ‘కూలీ’ చిత్రాల్లో నటిస్తోంది. హిందీలో కూడా ఆమె ‘హే జవానీ తో ఇష్క్ హోనా హై’ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. త్వరలో ఓటీటీలోనూ అడుగుపెట్టనుందీ బ్యూటీ. ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో నటించనున్నట్టు సమాచారం. పూజా హెగ్డే టాలీవుడ్‌కు తిరిగి వస్తుందా? లేదా తమిళ, హిందీ సినిమాలతోనే కెరీర్‌ను కొనసాగిస్తుందా? అన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News