Dimple Hayathi: డింపుల్ క్రిమినల్ కేసులో అసలు నిజాలు..
Dimple Hayathi: రామబాణం హీరోయిన్ డింపుల్ హాయతిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.
Dimple Hayathi: డింపుల్ క్రిమినల్ కేసులో అసలు నిజాలు..
Dimple Hayathi: రామబాణం హీరోయిన్ డింపుల్ హాయతిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టారనే అభియోగం పై డింపుల్ హాయతిపై క్రిమినల్ కేసు పెట్టారు. డీసీపీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో డింపుల్ పై ఐపీసీ సెక్షన్లు 353, 341,279 కింద కేసు నమోదు చేశారు. డింపుల్ తో పాటు ఆమె స్నేహితుడు డేవిడ్ కు 41 సీఆర్ పీసీ కింద నోటీసులు ఇచ్చారు.
అసలు వివాదం ఏంటి
హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని హుడా ఎంక్లేవ్ లో డింపుల్ హాయతి నివాసం ఉంటున్నారు. ఆమె నివసిస్తున్న అపార్ట్ మెంట్ లోనే డీసీపీ రాహుల్ హెగ్డే కూడా ఉంటున్నారు. అయితే ఇరువురి మధ్య పార్కింగ్ విషయంలో తరచుగా వివాదాలు జరుగుతున్నాయి. ఈక్రమంలోనే ఈనెల 14న రాత్రి..పార్క్ చేసి ఉన్న డీసీపీ వాహనాన్ని డింపుల్ హాయతి ఢీ కొట్టింది. అంతేకాకుండా డీసీపీ కారును కాలితో తన్ని వీరంగం సృష్టించింది. ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. సీసీ కెమెరాల్లో ఫుటేజ్ ఆధారంగా డింపుల్ పై డీసీసీ కారు డ్రైవర్ ఫిర్యాదు చేయడంతో ఆమెపై జూబ్లిహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు పెట్టారు.
డింపుల్, డీసీపీ వాదనలు
డింపుల్ వాదన మరో విధంగా ఉంది. అధికారంతో చేసిన తప్పును కప్పిపుచ్చలేరంటూ డింపుల్ ట్వీట్ చేసింది. గతవారం రోజులుగా తన కారుపై అకారణంగా ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేస్తున్నారని డింపుల్ ఆరోపిస్తున్నారు. మరోవైపు డింపుల్ పై తనకు ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవని డీసీపీ రాహుల్ హెగ్డే స్పష్టం చేశారు. మొత్తానికి, పార్కింగ్ విషయంలో ఇద్దరి మధ్య వివాదం రాజుకుందని అర్థమవుతుంది. పార్కింగ్ విషయంలో ఎలాంటి సమస్య ఉన్నా ఇరువురు అపార్ట్ మెంట్ కమిటీకి ఫిర్యాదు చేసి ఉంటే బాగుండేది.