OTT Movies This Week: థియేటర్స్ & ఓటీటీల్లో కొత్త సినిమాలు – జనవరి ఫస్ట్ వీక్ 2026

జనవరి ఫస్ట్ వీక్ 2026 కోసం థియేటర్లలో పలు కొత్త సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఓటీటీలో ఎకో, హక్, Stranger Things Season 5, LBW వంటి సినిమాలు ప్రేక్షకులను ఎదురుచూస్తున్నాయి.

Update: 2025-12-30 14:00 GMT

కొత్త ఏడాది 2026 రాబోతున్నందున థియేటర్లలో పలు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ వారం విడుదలకాబోయే సినిమాల్లో సైక్ సిద్ధార్థ్, వనవీర, త్రిముఖ, సకుటుంబానాం, నీలకంఠ, వినరా ఓ వేమ్, ఘంటసాల, 45, గత వైభవం తదితర చిత్రాలు ఉన్నాయి. వీటిలో కొన్ని స్ట్రెయిట్-డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి.

అదేవిధంగా, ఓటీటీల్లో కూడా కొత్త కంటెంట్ ప్రేక్షకుల కోసం సిద్ధంగా ఉంది. ఈ వారం ప్రత్యేకంగా మలయాళ్ డబ్బింగ్ చిత్రం ‘ఎకో’ చాలా ఆసక్తికరంగా ఉంది, ఎందుకంటే ఒరిజినల్ వెర్షన్ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో తెలుగు ప్రేక్షకులు దీన్ని ఎదురుచూస్తున్నారు.

ఇతర ఓటీటీ రిలీజ్‌లు కూడా వేరే సిరీస్, సినిమాలతో ఉన్నాయి. హిందీ మూవీ ‘హక్’, స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 3, ఎల్‌బీడబ్ల్యూ తెలుగు సిరీస్ వంటివి ఈ వారంలో అందుబాటులోకి రాబోతున్నాయి.

ఈ వారం OTT రిలీజ్ షెడ్యూల్ (డిసెంబర్ 29 – జనవరి 4)

Netflix:

  • Members Only (ఇంగ్లీష్ రియాలిటీ సిరీస్) – జనవరి 29
  • ఎకో (తెలుగు డబ్బింగ్ సినిమా) – డిసెంబర్ 31
  • Stranger Things సీజన్ 5 వాల్యూమ్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జనవరి 01
  • Lupin సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 01
  • హక్ (హిందీ మూవీ) – జనవరి 02

Amazon Prime:

  • సూపర్ నోవా (నైజీరియన్ మూవీ) – డిసెంబర్ 29
  • Cege Me Vos (ఇంగ్లీష్ మూవీ) – జనవరి 02

Hotstar:

ఎల్‌బీడబ్ల్యూ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జనవరి 01

Sun NXT:

ఇతిరి నేరమ్ (మలయాళ మూవీ) – జనవరి 01

Tags:    

Similar News