Vijay Deverakonda- Rashmika: విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి డేట్ ఇదే..వేదిక ఎక్కడో తెలుసా..?
Vijay Deverakonda- Rashmika: విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి డేట్ ఇదే..వేదిక ఎక్కడో తెలుసా..?
Vijay Deverakonda- Rashmika: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రేమాయణం గురించి చాలా కాలంగా చర్చ నడుస్తూనే ఉంది. వీరిద్దరూ తమ వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచాలని ఎంత ప్రయత్నించినా, అభిమానుల కళ్ల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. ఎక్కడికి వెళ్లినా, ఏ సందర్భంలో కనిపించినా ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. దీంతో వీరి రిలేషన్‌షిప్‌పై అనుమానాలకు మరింత బలం చేకూరింది.
ఇప్పటివరకు ప్రేమ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయని ఈ జంట, ఇటీవల చాలా సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఎంగేజ్మెంట్‌కు సంబంధించిన ఫోటోలు కానీ, వీడియోలు కానీ ఎక్కడా బయటకు రాలేదు. విజయ్, రష్మిక ఇద్దరూ ఈ విషయాన్ని పూర్తిగా ప్రైవేట్‌గా ఉంచారు. నిశ్చితార్థం తర్వాత కూడా ఎవరి సినిమాల పనుల్లో వారు బిజీగా మారిపోయారు.
ఇప్పటికే సోషల్ మీడియాలో వీరి పెళ్లి గురించి అనేక రకాల డేట్లు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, వీరి వివాహ తేదీ కూడా దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే పెళ్లి జరగనున్నట్లు టాక్. అక్టోబర్ 3న నిశ్చితార్థం జరిగినట్లు వినిపిస్తుండగా, ఫిబ్రవరి 26న వివాహం జరగనుందని ప్రచారం జరుగుతోంది.
ఈ పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఉన్న ఓ ప్యాలెస్‌లో ఘనంగా, కానీ చాలా ప్రైవేట్‌గా వేడుక జరగనుందని తెలుస్తోంది. నిశ్చితార్థం మాదిరిగానే పెళ్లిని కూడా మీడియా హడావుడి లేకుండా, కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నిర్వహించాలని ఈ జంట భావిస్తున్నట్లు వినిపిస్తోంది. దీనిపై అధికారిక క్లారిటీ మాత్రం త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.
వృత్తి పరంగా చూస్తే, రష్మిక మందన్న కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగులోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి ‘గీత గోవిందం’ సినిమాలో నటించి భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’లో కూడా జంటగా కనిపించారు. ఈ సినిమాల సమయంలోనే వీరి మధ్య స్నేహం ప్రేమగా మారిందన్న ప్రచారం మొదలైంది.
ప్రస్తుతం ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. రష్మిక తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తుండగా, విజయ్ దేవరకొండ త్వరలోనే ‘రౌడీ జనార్ధన’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రేమ నుంచి నిశ్చితార్థం వరకు ప్రయాణించిన ఈ జంట, త్వరలో పెళ్లితో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.