అక్టోబర్ 15న పీఎం న‌రేంద్ర‌మోదీ బయోపిక్ రీరిలీజ్!

PM Narendra Modi : కరోనా వలన నష్టపోయిన రంగాలలో సినిమా రంగం ఒకటి.. కరోనా వలన షూటింగ్ లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.. సినిమా ధియేటర్లు కూడా మూతపడ్డాయి.. దీనితో విడుదలకి సిద్దంగా ఉన్న మూవీస్ అన్నీ వాయిదా పడ్డాయి..

Update: 2020-10-10 12:47 GMT

Narendra Modi

PM Narendra Modi : కరోనా వలన నష్టపోయిన రంగాలలో సినిమా రంగం ఒకటి.. కరోనా వలన షూటింగ్ లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.. సినిమా ధియేటర్లు కూడా మూతపడ్డాయి.. దీనితో విడుదలకి సిద్దంగా ఉన్న మూవీస్ అన్నీ వాయిదా పడ్డాయి.. తాజాగా కేంద్రం ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులలో భాగంగా కొన్ని మార్గదర్శకాలతో ధియేటర్ లకి అనుమతిని ఇచ్చింది. దీనితో ఈ నెల 15 నుంచి ధియేటర్లు ఓపెన్ కానున్నాయి..

ధియేటర్లు రీఒపెన్ అవుతుండడంతో అక్టోబ‌ర్ 15న భార‌త ప్రధాని న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌ని రీరిలీజ్ చేయ‌బోతున్నట్టు మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్రక‌టించారు. ముందుగా ఈ సినిమాని 2019 ఎల‌క్షన్స్ కంటే ముందు రిలీజ్ చేయాల‌ని భావించారు. అయితే అప్పుడు ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉండ‌డంతో సినిమాని మే 24,2019న చిత్రాన్ని రిలీజ్ చేశారు. అయితే సినిమా పైన అనేక వివాదాలు తలెత్తడంతో సినిమాకి అంతగా కలెక్షన్లు రాలేదు..

దీనితో రీరిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. అందువల్ల సినిమాని ఓటీటీ లేదా టీవీలో కూడా ప్రసారం చేయ‌లేదు. తాజాగా ధియేటర్ లకి అనుమతి రావడంతో మళ్ళీ ధియేటర్లలోనే రిలీజ్ చేయనున్నారు. ప్రజ‌లు త‌గిన జాగ్రత్తలు తీసుకొని థియేటర్స్‌కు వ‌స్తార‌ని ఆశిస్తున్నట్టుగా నిర్మాత వెల్లడించారు. ఈసినిమాని సందీప్ సింగ్ నిర్మించగా, ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించారు. వివేక్ ఒబేరాయ్ ప్ర‌ధాన పాత్ర పోషించారు.

Tags:    

Similar News