Sreeleela: 'నన్ను అలా పిలవకండి ప్లీజ్'.. శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకున్న శ్రీలీల తనను మాత్రం.. స్టార్ హీరోయిన్ అని పిలవకండని చెబుతోంది.

Update: 2024-08-10 09:25 GMT

Sreeleela: 'నన్ను అలా పిలవకండి ప్లీజ్'.. శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Sreeleela: పెళ్లి సందడి చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార శ్రీలీలా. తొలి సినిమాతోనే తన అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ చిన్నది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, శ్రీలీల నటనకు కూడా మంచి మార్కులు పడడంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది.

దమాకా, స్కంద, గుంటూరు కారం, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ వంటి వరుసగా పెద్ద సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇక ప్రస్తుతం రాబిన్‌ హుడ్‌, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉందీ చిన్నది. తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకున్న శ్రీలీల తనను మాత్రం.. స్టార్ హీరోయిన్ అని పిలవకండని చెబుతోంది. స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకోవాలని ఉందని కానీ, ఇప్పుడే తనను అలా పిలవడం నచ్చదని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తక్కువ సమయంలోనే అగ్ర హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకున్నా ఇప్పటికీ స్టార్ అని పిలిపించుకోవడానికి తనకింకా ఆ అర్హత రాలేదని చెప్పుకొచ్చింది. ఈ విషయమై శ్రీలీలా మాట్లాడుతూ.. ‘‘నా దృష్టిలో స్టార్ కిరీటం అన్నది ఒకటి రెండు చిత్రాల ప్రయాణంతో వచ్చేసేది కాదు. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలతో అలరించాలి. ఏళ్ల పాటు ప్రేక్షకులతో కలిసి ప్రయాణం చేయాలి. అప్పుడే స్టార్ అని పిలిపించుకోవడానికి తగిన అర్హత పొందానని భావిస్తా' అని చెప్పుకొచ్చింది.

తనను ఎవరైనా స్టార్ అని పిలిస్తే సున్నితంగా అలా పిలవొద్దని చెబుతుంటానంది. ప్రస్తుతం తన దృష్టంతా విభిన్నమైన కథలు, పాత్రలు చేయడంపై ఉందని చెప్పుకొచ్చిన శ్రీలీలా.. స్పెషల్ సాంగ్స్ లో నటిస్తార అన్న దానికి బదులిస్తూ.. ఇప్పుడప్పుడే ఆ ఆలోచన లేదని తేల్చి చెప్పింది.

Tags:    

Similar News