Pawan Kalyan: ముచ్చ‌ట‌గా మూడో డైరెక్ట‌ర్‌.. హరిహర వీరమల్లు కోసం రంగంలోకి టాప్ ద‌ర్శ‌కుడు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలకు స్వల్ప విరామం ఇచ్చి రాజకీయాలకు పూర్తి స్థాయి ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందే

Update: 2025-05-06 11:31 GMT

Pawan Kalyan: ముచ్చ‌ట‌గా మూడో డైరెక్ట‌ర్‌.. హరిహర వీరమల్లు కోసం రంగంలోకి టాప్ ద‌ర్శ‌కుడు

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలకు స్వల్ప విరామం ఇచ్చి రాజకీయాలకు పూర్తి స్థాయి ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందే. చివరిసారిగా ఆయన 2023లో విడుదలైన 'బ్రో' సినిమా ద్వారా థియేటర్లలో కనిపించారు. అంతకు ముందు 'భీమ్లా నాయక్'లో తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. ఎన్నికల వేళ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న పవన్ కళ్యాణ్, విజయం సాధించి ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. ఇక ఇప్పుడు ఆయన అభిమానులు ఎదురు చూస్తున్న ప్రశ్న ఏంటంటే పవన్ కళ్యాణ్ మళ్లీ స్క్రీన్ పై ఎప్పుడు కనిపిస్తారు?

పవన్ కళ్యాణ్ తన రాజకీయ బాధ్యతల నడుమా కొంతకాలం వరకు సినిమాల షూటింగులను కొనసాగించారు. అయితే ఎన్నికల వేళ వాటిని తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం ఆయన చేతిలో హరిహర వీరమల్లు (పార్ట్ 1), ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ మూడు ప్రధాన ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ సినిమాలన్నీ ఇప్పటికే షూటింగ్ దశలో ఉండగా, ఇప్పుడిప్పుడే పవన్ సినిమాల కోసం స‌మ‌యం కేటాయిస్తున్నారు.

అయితే ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రయాణం అనేక మలుపులతో సాగుతోంది. మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు, కొన్ని కారణాలతో వాయిదా ప‌డింది. అనంతరం ఏఎం జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను పర్యవేక్షిస్తూ, ప్రాజెక్టును సరైన దిశగా నడిపిస్తున్నారు. గతంలో భీమ్లా నాయక్‌ సినిమాకు కూడా త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే పర్యవేక్షణ అందించిన విషయం తెలిసిందే.

ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధికంగా వాయిదా పడిన చిత్రాల్లో ‘హరిహర వీరమల్లు’ ఒకటిగా నిలిచింది. సుమారు 13 సార్లు రిలీజ్ తేదీ మారిపోయింది. మొదట 2024 మే 9న విడుదల చేస్తామని ప్రకటించినా, అది సాధ్యపడలేదు. తాజా సమాచారం ప్రకారం, మేకర్స్ ఇప్పుడు మే 30న విడుదల చేయాలని భావిస్తున్నారు. చిత్రీకరణ మొత్తం పూర్తై, పోస్టు ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మ‌రి చెప్పిన‌ట్లు మే 30న ఈ సినిమా వ‌స్తుందో చూడాలి.

Tags:    

Similar News