Vakeel Saab First Day Collections: వకీల్ సాబ్ డే 1 కలెక్షన్స్ ప్రభంజనం

Update: 2021-04-10 09:59 GMT

వకీల్ సాబ్ ఫైల్ ఫోటో 

Vakeel Saab First Day Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమా కోసం మూడేళ్లుగా ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తువచ్చారు. పవన్ నుంచి సినిమా లేకపోవడంతో సైలెంటుగా ఉంటూ వచ్చారు ఫ్యాన్స్. 'వకీల్ సాబ్' విడుదల అవడంతో థియేటర్ల వద్ద హంగామా నెలకొంది. తొలి రోజు వసూళ్ల లెక్కింపులో జాప్యం జరిగింది. దాంతో వివిధ ఏరియాలో టికెట్ రేట్లు ఒక్కో విధంగా ఉన్నాయి. మరోవైపు ఏపీలో కరోనా విజృంభిస్తోన్న వేళ హైకోర్టు ఆర్డర్స్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ షోలు బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరించింది. అయితే పవన్ సినిమా వకీల్ సాబ్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.

ఈ సినిమా విషయానికి వస్తే..అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన పింక్ సినిమాకు తెలుగులో పవన్ హీరోగా రీమేక్ గా తెరకెక్కింది. దర్శకుడు వేణు శ్రీరామ్ పింక్ సినిమాలోని కథను పవన్ ఇమేజ్‌కు తగ్గట్లుగా పక్కా కమర్షియల్ సినిమాగా రూపొందించాడు. పవన్ కు జోడీగా శృతిహాసన్ నటించగా, ప్రకాష్ రాజ్, నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

అయితే కొన్ని ప్రాంతాల్లో కలెక్షన్ల వివరాలు అందుబాటులోకి వచ్చాయి. ఖమ్మం జిల్లాలో తొలి రోజున 25 షోలు ప్రదర్శించగా.. రికార్డు స్థాయిలో రూ.30 లక్షలకుపైగా వసూళ్లను రాబట్టింది. సీడెడ్‌లో భారీగా వసూళ్లను నమోదు చేసింది. రూ.4.2 కోట్ల షేర్ రాబట్టింది. కృష్ణ జిల్లాలో గ్రాండ్‌గా కలెక్షన్లను రాబట్టింది.రూ.1.90 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. నైజాంలో వకీల్ సాబ్ హవా కొనసాగింది. ఇక్కడ రూ.10 కోట్లకుపైగా ఓపెనింగ్స్ రాబట్టినట్టు సమాచారం. గోదావరి జిల్లాలో రికార్డులు సృష్టిస్తుంది. తొలి రోజున పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.3.10 కోట్ల..ఈస్ట్ గోదావరి జిల్లాలో రూ.3.10 కోట్లు వసూలు చేసింది. అలాగే ఉత్తరాంధ్రలో ఈ చిత్రం రూ.3.8 కోట్లు రాబట్టింది.

ఇక ఓవర్సీస్‌లో ప్రభంజనం సృష్టించింది. పవన్ మూవీ తొలి రోజున 400k డాలర్లను వసూలు చేసింది. ప్రీమియర్లతో కలుపుకొంటే 730k డాలర్లను రాబట్టింది. భారత కరెన్నీలో చూస్తే..రూ.5.5 కోట్లుపై మాటే. మొత్తానికి పవన్ కళ్యాణ్ తొలి రోజు 40 కోట్ల రూపాయలుపైగా సాధించినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా వెలువడలేదు. 

Tags:    

Similar News