"నేను సహాయం అడగడం అరుదు" – అర్జున్ దాస్‌కు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా సినిమా హరిహర వీరమల్లు ట్రైలర్‌లో వాయిస్ ఓవర్ ఇచ్చిన తమిళ నటుడు అర్జున్ దాస్‌ను పవన్ కళ్యాణ్ అభినందించారు.

Update: 2025-07-03 16:02 GMT

"నేను సహాయం అడగడం అరుదు" – అర్జున్ దాస్‌కు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా సినిమా హరిహర వీరమల్లు ట్రైలర్‌లో వాయిస్ ఓవర్ ఇచ్చిన తమిళ నటుడు అర్జున్ దాస్‌ను పవన్ కళ్యాణ్ అభినందించారు. అర్జున్ గొంతులో ఉన్న గంభీరత, మ్యాజిక్‌కి పవన్ మెచ్చుకుపోతూ భావోద్వేగంగా స్పందించారు.

ఇంకా వివరాల్లోకి వెళితే… “పవన్ కళ్యాణ్ గారు ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్‌కి వాయిస్ ఓవర్ ఇవ్వమని అడిగారు. అలాంటి అవకాశానికి ‘వెంటనే ఓకే’ చెబుతాం. ఇది గర్వించదగిన విషయం. మీకు, మీ టీమ్‌కి శుభాకాంక్షలు” అంటూ అర్జున్ దాస్ తన ట్వీట్‌లో తెలిపారు.

దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, “ప్రియమైన అర్జున్ దాస్, నీకు నేను రుణపడి ఉంటాను. నేను ఎవరినైనా చాలా అరుదుగా ఏదైనా అడుగుతాను. నన్ను నిరాకరించకుండా నా అభ్యర్థనను అంగీకరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నీ గొంతులో అద్భుతమైన మెలోడీ, మాయ ఉంది” అంటూ కితాబిచ్చారు.

ఈ మాటలు అభిమానుల మనసులను తాకగా, అర్జున్ దాస్ మీద పవన్ చూపిన అభిమానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



Tags:    

Similar News