పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ వైరల్ – ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ ఫోటోలు నెట్టింట ట్రెండ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నా, సినిమా commitmentsను కూడా సమానంగా బ్యాలన్స్ చేస్తున్నారు.

Update: 2025-07-06 10:46 GMT

 Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నా, సినిమా commitmentsను కూడా సమానంగా బ్యాలన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లో పాల్గొంటున్న ఆయన తాజా ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

శనివారం జరిగిన “ది 100” సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి పవన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అదే చిత్రంలోని లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ కు పండగలా మారింది. ఈవెంట్‌లో మూవీ యూనిట్‌తో దిగిన ఫోటోలు నిన్నటినుంచి నెట్టింట వైరల్‌గా మారగా, తాజాగా మరిన్ని ఫోటోలు బైటకు వచ్చాయి.

వీటిలో పవన్ స్టైలిష్‌గా కూర్చున్న లుక్, మరోదాంట్లో ఆయన స్వాగ్‌గా నడుస్తున్న తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వీటిని చూసిన ఫ్యాన్స్ “వకీల్ సాబ్ మూడ్ మళ్లీ వచ్చిందా?”, “పవన్ కళ్యాణ్ స్వాగ్ అంటే ఇదే” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ తన సినిమా గెటప్‌లో కలర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్న పవన్ ఈ కొత్త ఫొటోలతో మళ్లీ తన స్టార్ డమ్‌ను నిరూపించుకున్నారు. రామ్ తల్లిని మించిన స్టైల్‌తో, అభిమానుల్లో కొత్త జోష్ నింపుతున్నారు.

Tags:    

Similar News