పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ - ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు స్టార్ హీరోలు
మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య గ్యాప్ ఉందన్న చర్చలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ – అల్లు ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్ కూడా సోషల్ మీడియాలో బాగా కనిపిస్తోంది. అయితే ఆ వాదనలన్నింటికీ చెక్ పెట్టేలా ఒక అరుదైన ఫ్రేమ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. చాలా ఏళ్ల తర్వాత పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకే వేదికపై కనిపించారు.

అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ ఇటీవల మృతి చెందగా, నేడు హైదరాబాద్‌లో ఆమె పెద్దకర్మ జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి – సురేఖ దంపతులు, రామ్ చరణ్, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకే సోఫాలో కూర్చొని ముచ్చటించడం అభిమానులను ఆనందపరిచింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఈ ముగ్గురినీ ఒకే ఫ్రేమ్‌లో చూసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. "ఇకపై ఫ్యాన్ వార్ ఆగిపోతుంది" అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అటు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించగా, అల్లు అరవింద్ కుటుంబం వచ్చిన అతిథులందరినీ ఆత్మీయంగా ఆహ్వానించింది. సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు.
చాలాకాలం తర్వాత మెగా – అల్లు కుటుంబాలు ఒకే వేదికపై కలసి కనిపించడం ఫ్యాన్స్‌కు నిజంగా పండుగలా మారింది.