Dil Raju: పవన్‌ సినిమాలను ఆపే దమ్ము ఎవరికీ లేదు..!

Dil Raju: సినీ ఇండస్ట్రీలో ఇటీవల తలెత్తిన థియేటర్స్ బంద్ వివాదంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-05-26 13:17 GMT

Dil Raju: పవన్‌ సినిమాలను ఆపే దమ్ము ఎవరికీ లేదు..!

Dil Raju: సినీ ఇండస్ట్రీలో ఇటీవల తలెత్తిన థియేటర్స్ బంద్ వివాదంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదానికి తెరదించిన ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, అసలు పరిస్థితి ఏమిటో స్పష్టంగా వివరించారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా తూర్పు గోదావరిలో పర్సంటేజ్ విధానంపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఈ సమస్యను తెలంగాణపై నెట్టేసినట్టు ప్రచారం జరిగింది. నిజానికి ‘హరిహర వీరమల్లు’ విడుదల తేదీ తరువాత ఈ వివాదం చుట్టుముట్టింది. కానీ, పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపే ధైర్యం ఎవరికీ లేదని, ఈ వార్తలు పూర్తిగా తప్పుగా కమ్యూనికేట్ అయ్యాయన్నారు.

నైజాం ప్రాంతానికి కూడా ఈ సమస్య వచ్చినప్పటికీ, అక్కడ ఉన్న ఎగ్జిబిటర్ల సమస్యలను శిరీష్ దృష్టికి తీసుకువచ్చినట్టు చెప్పారు. మే 18న ఛాంబర్ మీటింగ్ జరిగినప్పటికీ, చివరి పదిహేను నిమిషాల్లో మాత్రమే తాను హాజరయ్యానని, జూన్ 1 నుండి థియేటర్స్ బంద్ అనే వార్తను మీడియా ముందుగా రిపోర్ట్ చేసిందని పేర్కొన్నారు.

డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మద్య జరిగిన సమావేశంలో జూన్ 1 నుంచి థియేటర్లు కొనసాగించాలని, థియేటర్స్ బంద్ చేయకూడదని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఈ సందర్బంగా వచ్చిన భ్రమను క్లియర్ చేయడంలో మంత్రి దుర్గేష్ గారి పాత్ర అభినందనీయమని చెప్పారు.

ఈ నెల 30న ‘భైరవ’, జూన్ 5న కమలహాసన్ సినిమా, జూన్ 12న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’, జూన్ 20న ‘కుబేర’ సినిమాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో, ఇలాంటి భ్రమలు పుట్టకుండా, పరిశ్రమ సమగ్రంగా ముందుకెళ్లాలని దిల్ రాజు పిలుపునిచ్చారు.

అంతేకాకుండా, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇండస్ట్రీకు ఎప్పుడూ సానుకూలంగానే ఉంటాయని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. ఇకపై ఈ అంశానికి ముగింపు పలకాలని కోరుతూ — మంచి సినిమాలు తీసి, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు లార్వెన్ అనే AI సంస్థను, దిల్ రాజు డ్రీమ్స్ సంస్థను ప్రారంభించినట్టు తెలిపారు. ముగింపులో, ఇండస్ట్రీ ఐక్యతే అవసరమని, అసత్య ప్రచారాలకు అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగాలని దిల్ రాజు స్పష్టం చేశారు.

Tags:    

Similar News