Pawan Kalyan: పవన్ కళ్యాణ్ 'హరి హర వీర మల్లు' యాక్షన్ సీన్ లీక్
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్థాయిలో వస్తోన్న ‘హరి హర వీర మల్లు’ యాక్షన్ సీన్ లీక్ అయ్యింది.
Pawan Kalyan Hari Hara Veeramallu Movie Updates
Pawan Kalyan: పాన్ ఇండియన్ స్థాయిలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరి హర వీర మల్లు సినిమాలోని మల్ల యోధులతో పవన్ పోరాటం చేస్తున్న వీడియో బయటికి వచ్చింది. హరి హర వీరమల్లు సినిమా 16వ శతాబ్ధపు కథతో వస్తుంది. కోహినూర్ వజ్రం నేపథ్యంలో కథ సాగుతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ బందిపోటు పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో పాతబస్తీ మల్ల యోధులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
కరోనా తర్వాత మళ్లీ ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నాడు పవన్ కళ్యాణ్. బాలీవుడ్ హీరోయిన్స్ జాక్వలిన్ ఫెర్నాండేజ్, నిధి అగర్వాల్ ఇందులో నటిస్తున్నారు. అర్జున్ రాంపాల్ ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నాడు. సీనియర్ నిర్మాత ఏఎం రత్నం హరి హర వీరమల్లు సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం కోసం 100 కోట్లకు పైగానే బడ్జెట్ పెడుతున్నారు. ఎన్ని విధాలుగా కంట్రోల్ చేస్తున్నా కూడా ఏదో ఓ రూపంలో లీకులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.