Hari Hara Veeramallu: కొల్లగొట్టినాదిరో.. హరిహర వీరమల్లు నుంచి రెండో పాట రిలీజ్

కొల్లగొట్టినాదిరో.. నా గుండె కొల్లగొట్టినాదిరో అంటూ సాగే ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకేసారి ఐదు భాషల్లో ఈ పాటను సోమవారం మధ్యాహ్నం చిత్ర బృందం విడుదల చేసింది.

Update: 2025-02-24 12:19 GMT

కొల్లగొట్టినాదిరో.. హరిహర వీరమల్లు నుంచి రెండో పాట రిలీజ్

Hari Hara Veeramallu: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఈ మూవీని క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, ఒక సాంగ్ రిలీజ్ చేయగా ఫిబ్రవరి 24 రెండో పాట కొల్లగొట్టినాదిరో అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు.

కొల్లగొట్టినాదిరో.. నా గుండె కొల్లగొట్టినాదిరో అంటూ సాగే ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకేసారి ఐదు భాషల్లో ఈ పాటను సోమవారం మధ్యాహ్నం చిత్ర బృందం విడుదల చేసింది. కొర కొర మీసాలతో కొదమ కొదమ అడుగులతో అంటూ వీరమల్లుని పొగుడుతూ సాగింది ఈ పాట. మంచి మాస్ బీట్‌తో సాంగ్ అదిరిపోయింది. ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం. కీరవాణి అందించిన బాణీలకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల ఈ పాటను ఆలపించారు. హీరోయిన్ నిధి అగర్వాల్ తో పాటు పూజిత పొన్నాడ, స్టార్ యాంకర్ అనసూయతో కలిసి పవన్ అదిరిపోయే స్టెప్పులేశారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ మాట వినాలి పాటకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటను పవన్ కళ్యాణ్ స్వయంగా పాడారు. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఏ.దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్‌కు జంటగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. పవన్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి లాంటి బాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

హరిహర వీరమల్లు మూవీ క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతోంది. అయితే క్రిష్ సినిమాకు సగానికి పైగా దర్శకత్వం వహించారు. కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో మిగిలిన భాగానికి నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. రెండో పార్ట్ మొత్తాన్ని జ్యోతికృష్ణ తెరకెక్కిస్తారు. ఇక ఈ సినిమాను మార్చి 28న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

అయితే పవన్ పొలిటికల్‌గా బిజీగా ఉండడంతో అనుకున్న టైంకు మూవీ రిలీజ్ చేస్తారా..? లేదా అనే దానిపై సందేహాలు నెలకొనగా.. చెప్పిన టైంకే రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇటీవల స్పష్టత ఇచ్చారు. తాజాగా విడుదలైన సాంగ్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి.

Full View


Tags:    

Similar News