డిస్ట్రిబ్యూటర్ లను వేలెత్తి చూపిస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులు

డిస్ట్రిబ్యూటర్ లను వేలెత్తి చూపిస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులు

Update: 2022-03-02 10:30 GMT

డిస్ట్రిబ్యూటర్ లను వేలెత్తి చూపిస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులు

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు హీరోలుగా నటించిన "భీమ్లా నాయక్" సినిమా భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 25న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. కలెక్షన్ల సునామి సృష్టించిన ఈ సినిమా మొదటి వారాంతంలోనే 60 శాతం రికవరీ చేసి అందరికీ గట్టి షాక్ ఇచ్చింది. అయితే సోమవారం నుంచి కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. శివరాత్రి రోజు కూడా కలెక్షన్లు అంతంతమాత్రంగానే నడిచాయి. నాల్గవ రోజున సినిమా కలెక్షన్లు తక్కువగానే ఉన్నాయి. ఆంధ్రాలో కలెక్షన్లు యావరేజ్ గా ఉండగా నైజాంలో మాత్రం కలెక్షన్లు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు డిస్ట్రిబ్యూటర్ లను బ్లేమ్ చేస్తున్నారు.

వారాంతం తర్వాత మళ్లీ శివరాత్రి కూడా సెలవు రావడంతో డిస్ట్రిబ్యూటర్లు టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాకూడా విడుదల చేశారని అదే ఇప్పుడు సినిమా కలెక్షన్లు తగ్గడానికి కారణం అని కొందరు చెబుతున్నారు. అయితే డిసెంబర్ లో అఖండ మరియు పుష్ప సినిమాలు విడుదల అయ్యాయి. ఆ సమయంలో కూడా టికెట్ రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఈ సినిమాలు థియేటర్లలో బాగానే సందడి చేశాయి. 4, 5 రోజుల్లో కూడా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఈ నేపథ్యంలో "భీమ్లా నాయక్" సినిమా కలెక్షన్లు తగ్గడం ఎవరు ఊహించనటువంటిది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News