Surya - Jai Bhim: సూర్య పై నష్ట పరిహారం వేసిన పార్టీ నేతలు

Surya - Jai Bhim: సూర్య 5 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న రాజకీయ వర్గాలు

Update: 2021-11-15 16:30 GMT

సూర్య పై నష్ట పరిహారం వేసిన పార్టీ నేతలు (ఫైల్ ఇమేజ్)

Surya - Jai Bhim: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన "జై భీమ్" సినిమా అందరి నుండి ప్రశంసలను అందుకుంటోంది. కానీ మరో వైపు తమిళనాడులో ఈ సినిమాపై చెలరేగిన వివాదం రోజు రోజుకీ పెరుగుతూ వస్తోంది. సినిమా పై వన్నియర్ వర్గాల నేతలు మండిపడుతున్నారు. సూర్య తమ వర్గాన్ని కించపరిచాడు అని, సూర్య నీ కొట్టిన వారికి ఏకంగా లక్ష రూపాయిలు బహుమానం కూడా ఇస్తాం అని పీఎంకే నేతలు ప్రకటించి సంచలనం సృష్టించారు. కొందరు నేతలు థియేటర్స్ వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

సినిమాలో చాలా సన్నివేశాల్లో వన్నియర్ వర్గాన్ని కావాలనే అవమానించేలా ఉన్నాయని వారి వాదన. సూర్య రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని వన్నియార్ సంగం నోటీసు సైతం జారీ చేసింది. ఇదే వివాదం ఫై నటుడు సూర్యకి మాజీ కేంద్రమంతి పీఎంకే ముఖ్య నేత అన్బుమణి కూడా ఓ లేఖను రాశారు. ఈ లేఖపై సూర్య స్పందిస్తూ తమకు సినిమా వల్ల దళితులపై జరుగుతున్న ఘటనలకు న్యాయం జరగాలనే ఉద్దేశం మాత్రమే ఉందని తమకు ఏ వర్గాన్ని కించపరిచే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించాలని పీఎంకే పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News