ఆ ఫార్మాట్‌లో వస్తున్న తొలి భారతీయ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌

RRR Movie on Dolby Cinema: గత కొన్ని నెలలుగా తెలుగు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "ఆర్ ఆర్ ఆర్".

Update: 2022-03-24 11:30 GMT

ఆ ఫార్మాట్‌లో వస్తున్న తొలి భారతీయ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌

RRR Movie on Dolby Cinema: గత కొన్ని నెలలుగా తెలుగు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "ఆర్ ఆర్ ఆర్". మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో మొట్టమొదటి సారిగా కలిసి నటించిన ప్యాన్ ఇండియన్ భారీ బడ్జెట్ మల్టీస్టారర్ సినిమా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మార్చ్ 25 న థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. అయితే 2డీ ఫార్మేట్ లో మాత్రమే కాకుండా త్రీడీలో కూడా ఈ సినిమా విడుదల కాబోతోంది.

డాల్బీ ఎట్మాస్ డాల్బీ విజన్ ఫార్మాట్లలో కూడా ఈ సినిమాను దర్శక నిర్మాతలు విడుదల చేయటం గమనార్హం. ఆ ఫార్మాట్‌లో విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రంగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఓవర్సీస్ ప్రేక్షకులను ఈ సినిమాను ఇంకా బాగా ఆస్వాదించడానికి డాల్బీ విజన్ థియేటర్ చూడమని సలహా ఇస్తున్నారు. ఇక మామూలు సౌండ్ సిస్టం ఉన్న థియేటర్ లో చూసే కంటే డాల్బీ ఎట్మాస్ ఉన్న థియేటర్లలో చూస్తే సినిమా మరింత మంచి ఎక్స్ పీరియన్సు వస్తుంది.

ఆడియో వీడియో ఫార్మెట్లను అత్యున్నత ప్రమాణాలతో అమెరికాకు చెందిన ఒక ప్రముఖ సంస్థ డాల్బీ లేబరేటరీస్ ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. మామూలుగా మనం థియేటర్లను చూసే ఒక ప్రేమ్ డాల్బీ లో 10 రెట్లు స్పష్టతతో కనిపిస్తుంది. ఎలా అయితే సినిమాని 35mm స్క్రీన్ 70mm స్క్రీన్ లో చూసినప్పుడు తేడా కనిపిస్తుందో సినిమాని మామూలు థియేటర్ల ఫార్మెట్లో చూసినప్పుడు మరియు డాల్బీ విజన్ చూసినప్పుడు అంతే తేడా కనిపిస్తుంది. అయితే డాల్బీ విజన్ కలిగిన థియేటర్లు మన దేశంలో ఇంకా అందుబాటులోకి అంతగా అందుబాటులోకి రాలేదు.

Tags:    

Similar News