OTT Movie : IMDbలో 9.4 రేటింగ్ సాధించిన ఈ లవ్ స్టోరీ.. మొదలుపెడితే ఆపలేరు.. ఏ ఓటీటీలో రానుందో తెలుసా?

మరాఠీ సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన ఓ కొత్త లవ్ స్టోరీ ప్రస్తుతం సినీప్రేమికులని మంత్రముగ్ధుల్ని చేస్తోంది. అద్భుతమైన సినిమాటోగ్రఫీ, మధురమైన సంగీతం, గ్రామీణ నేపథ్యం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

Update: 2025-08-31 08:30 GMT

OTT Movie : IMDbలో 9.4 రేటింగ్ సాధించిన ఈ లవ్ స్టోరీ.. మొదలుపెడితే ఆపలేరు.. ఏ ఓటీటీలో రానుందో తెలుసా?

మరాఠీ సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన ఓ కొత్త లవ్ స్టోరీ ప్రస్తుతం సినీప్రేమికులని మంత్రముగ్ధుల్ని చేస్తోంది. అద్భుతమైన సినిమాటోగ్రఫీ, మధురమైన సంగీతం, గ్రామీణ నేపథ్యం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇద్దరు ప్రేమికుల చుట్టూ తిరిగే ఈ కథ, ఉత్కంఠభరితమైన మలుపులతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. IMDbలో 9.4/10 రేటింగ్ అందుకోవడం ఈ సినిమాకి వచ్చిన క్రేజ్‌కి నిదర్శనం.

సినిమా వివరాలు

‘మాఝీ ప్రార్థనా’ (Majhi Prarthana) పేరుతో తెరకెక్కిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌ను పద్మరాజ్ రాజ్‌గోపాల్ నాయర్ తెరకెక్కించారు. గోల్యా పాత్రలో ఆయననే చూడవచ్చు. హీరోయిన్‌గా అనుషా అడెప్ (ప్రార్థన) నటించగా, ఉపేంద్ర లిమాయే, జైనేంద్ర నికలే కీలక పాత్రల్లో నటించారు. 2025 మే 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా త్వరలోనే Zee5, Jio Hotstar ఓటీటీలలో స్ట్రీమింగ్ కాబోతోంది.

కథలోకి వెళ్తే

మహారాష్ట్రలోని ఓ గ్రామీణ నేపథ్యంలో నడిచే ఈ ప్రేమకథలో గోల్యా అనే యువకుడు, ప్రార్థన అనే అమ్మాయి ప్రేమలో పడతారు. వారి అమాయకమైన ప్రేమ గ్రామానికి ఒక వెలుగురేఖలా నిలుస్తుంది. కానీ బ్రిటిష్ పాలనలోని ఒత్తిడులు, గ్రామ పెద్దల అడ్డంకులు, అలాగే ఉపేంద్ర అనే శత్రువు కుట్రలు ఈ ప్రేమను కుదిపేస్తాయి.

గోల్యా తన ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు. ప్రార్థన మాత్రం కుటుంబ బాధ్యతలు, సంప్రదాయాల మధ్య తడబడుతుంది. ఇదిలా ఉండగా ఉపేంద్ర, బ్రిటిష్ అధికారులతో రహస్య ఒప్పందాలు చేసుకున్న సంగతి బయటపడుతుంది. దీంతో కథ ఉత్కంఠభరితమైన క్లైమాక్స్ వైపు దూసుకుపోతుంది.

గోల్యా–ప్రార్థనల ప్రేమ గెలుస్తుందా? లేక విధి వారిని విడదీస్తుందా? అన్న ప్రశ్నలకు సమాధానం ఈ సినిమాలో దొరుకుతుంది.

Tags:    

Similar News