OTT Movie: భర్త సైకో అని తెలియని భార్య.. వాడి కంటికి అమ్మాయి కనబడితే అంతే

OTT Movie: సైకో కిల్లర్ స్టోరీలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది. ఈ కథలతో వచ్చే ప్రతి సినిమా ప్రేక్షకులను కుర్చీలకు కట్టిపడేస్తుంటాయి.

Update: 2025-03-04 14:30 GMT

OTT Movie: సైకో కిల్లర్ స్టోరీలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది. ఈ కథలతో వచ్చే ప్రతి సినిమా ప్రేక్షకులను కుర్చీలకు కట్టిపడేస్తుంటాయి. టెన్షన్ పెట్టిస్తూ అభిమానులను ఎంటర్ టైన్ చేస్తుంటాయి. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాలు కలెక్షన్స్ బాగానే వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఓ కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఎంటర్ టైన్ చేస్తుంది. హంతకులు అమ్మాయిలపై అఘాయిత్యం చేసి, గోనె సంచిలో కట్టి పడేసి వెళ్లిపోతుంటారు. పోలీసులు హంతకులను పట్టుకునే క్రమం చుట్టూ సినిమా నడుస్తుంది. ఈ మూవీ పేరు ‘గరుడ పురాణం’. 2023లో విడుదలైన ఈ మూవీ మంజునాథ్ బి నాగబా దర్శకత్వంలో వచ్చింది. సింధు కె ఎం ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీలో మంజునాథ్ బి నాగబా, సంతోష్ కర్కి, దిశా శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు.

కథలోకి వెళితే.. సిటీలో కొంతమంది అమ్మాయిలు వరుస హత్యలకు గురవుతుంటారు. ఈ అమ్మాయిలపై అఘాయిత్యం చేసి చంపేస్తుంటాడు ఓ హంతకుడు. ఆ తర్వాత గోనెసంచెలో పెట్టి శవాలను పడేస్తుంటారు. పోలీసులకు ఈ కేసు పెను సవాలుగా మారుతుంది. హత్య జరిగిన సమయంలో ఒక క్లూ కూడా దొరక్కపోవడంతో పోలీసులు ఆలోచనలో పడుతుంటారు. మరోవైపు నందిని అనే అమ్మాయిని మయూబ్ ప్రేమిస్తుంటాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడుతారు. అయితే ఈ విషయం ఎవరు ముందు చెప్తారాని ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో ముందుగా మయూబ్, నందినికి తన ప్రేమ విషయాన్ని చెబుతాడు. అయితే నందిని అన్నయ్య జ్యోతిష్యం చెబుతుంటాడు. నందిని కి పెళ్లి సంబంధం సెట్ చేస్తాడు తన అన్నయ్య. ఈ విషయం మాట్లాడదామని మయూబ్ ను కలిసేందుకు ఓ చోటుకు వెళ్తుంది.

ఈ క్రమంలో ఆమెను కిడ్నాప్ చేయడానికి సైకో గ్యాంగ్ ప్రయత్నిస్తుంది. ఈ సైకోలు లారీని నడుపుతూ, ఒంటరిగా ఉండే అమ్మాయిలను టార్గెట్ చేస్తుంటారు. అప్పుడే నందిని వీళ్లకు ఒంటరిగా కనిపిస్తుంది. మరుసటి రోజు నందిని శవంగా మారిపోతుంది. పోలీసులు బాయ్ ఫ్రెండ్ తో కలిపి అందరిని అనుమానిస్తారు. ఆ దారిలో వెళ్లే లారీలో ఉండే వ్యక్తిని కూడా విచారిస్తుంటారు. ఈ క్రమంలో వారికి షాక్ అయ్యే విషయాలు తెలుస్తాయి. ఆ సైకోలు అమ్మాయిలను చంపింది మేమేనని ఒప్పేసుకుంటాడు. అందులో ఒకడు భార్య తనతో గడపడం లేదన్న కారణంతో ఈ పని చేశానని చెబుతాడు. కానీ నందినిని మేము చంపలేదని పోలీసులకు షాక్ ఇస్తాడు. అయితే నందినిని చంపింది ఎవరు? అనే విషయం తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. 

Tags:    

Similar News