OTT Movie: యాక్షన్ అడ్వెంచర్ సినిమా.. ఏ ఓటీటీలో ఉందంటే?
హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాల అభిమానులకు సంతోషకరమైన వార్త! భారీ కలెక్షన్లు సాధించిన ‘హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్’ లైవ్ యాక్షన్ వెర్షన్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
OTT Movie: యాక్షన్ అడ్వెంచర్ సినిమా.. ఏ ఓటీటీలో ఉందంటే?
హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాల అభిమానులకు సంతోషకరమైన వార్త! భారీ కలెక్షన్లు సాధించిన ‘హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్’ లైవ్ యాక్షన్ వెర్షన్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. గత నెల థియేటర్లలో రిలీజ్ అయి ₹4 వేల కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చింది.
ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు ఆపిల్ టీవీ ప్లస్లో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో వీడియో ఆన్ డిమాండ్ (రెంటల్) విధానంలో మంగళవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
సినిమా కథేమిటి?
మొదట యానిమేషన్ రూపంలో నాలుగైదు భాగాలుగా వచ్చిన ఈ ఫ్రాంచైజీ ఇప్పుడు లైవ్ యాక్షన్‌గా వచ్చింది. బర్క్ అనే దీవిపై తరచూ డ్రాగన్లు దాడి చేస్తుంటాయి. వాటిని గ్రామస్థులు చంపాలని చూస్తారు కానీ విఫలమవుతారు.
ఓ రోజు యోధుడు స్టాయిక్ ది వాస్ట్ కుమారుడు హికప్ హాడక్, అరుదైన నైట్ ఫ్యూరీ జాతికి చెందిన డ్రాగన్‌ను గాయపరుస్తాడు. దానిని చంపకుండా రక్షించి, దానితో స్నేహం పెంచుకుంటాడు. ఆ తర్వాత గ్రామస్థులు డ్రాగన్ల సమస్యను ఎలా పరిష్కరించారనేదే మిగతా కథ.