Actress: ఆరెంజ్‌ మూవీ హీరోయిన్‌ ఇప్పుడెలా ఉందో తెలుసా.?

Shazahn Padamsee: రామ్‌చరణ్‌ హీరోగా వచ్చిన ఆరెంజ్‌ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

Update: 2024-12-11 14:00 GMT

Actress: ఆరెంజ్‌ మూవీ హీరోయిన్‌ ఇప్పుడెలా ఉందో తెలుసా..?

Shazahn Padamsee: రామ్‌చరణ్‌ హీరోగా వచ్చిన ఆరెంజ్‌ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 2010లో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది అయితే టీవీలో మాత్రం మంచి ఆదరణ లభించింది. వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా యూత్‌ను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో దర్శకుడు ప్రేమ అనే అంశాన్ని చూపించిన విధానం ఆకట్టుకుంది. ఇక పాటలు కూడా బాగా మెప్పించాయి.

కాగా ఈ సినిమాలో చెర్రీకి జోడిగా జెనీలియాతో పాటు మరో బ్యూటీ కూడా కనిపించింది. ఫ్లాష్‌ బ్యాక్‌లో రూబా పాత్రలో షాజన్ పదంసీ అనే అందాల తార నటించిన విషయం తెలిసిందే. సినిమాలో పదంసీ పాత్ర ఉండేది కొద్ది సేపే అయినా కథ పరంగా కీలక పాత్ర అని చెప్పాలి. ఈ సినిమాలో తన నటన, అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ చిన్నది.

ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కడుతాయని అంతా భావించారు. అయితే షాజన్‌ పదంసీ మాత్రం టాలీవుడ్‌లో పెద్దగా నటించలేదు. ఇతర భాషల్లో నటించినా తెలుగులో మాత్రం పెద్దగా కనిపించలేదు. 2009లో రాకెట్‌ సింగ్ అనే బాలీవుడ్‌ మూవీ ద్వారా వెండి తెరకు పరిచయమైన ఈ చిన్నది ఆ తర్వాత ఆరెంజ్‌తో పాటు వెంకటేష్‌-రామ్‌ హీరోగా వచ్చిన 'మసాలా' అనే సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో నటించలేదు.

ప్రస్తుతం జీఓఏటీఎస్‌ అనే టీవీషో చేస్తోందీ బ్యూటీ. కాగా సినిమాలకు దాదాపు దూరమైన ఈ బ్యూటీ తాజాగా పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైంది. మూవీ మ్యాక్స్‌ థియేటర్లకు సీఈఓ అయిన ఆశిష్‌ కనాకియాను వివాహం చేసుకోనుంది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్న ఈ జంటకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Tags:    

Similar News