Niharika Konidela: అఫీషియల్.. విడాకుల కోసం కోర్టుకెళ్లిన నిహారిక..
Niharika Konidela: అఫీషియల్.. విడాకుల కోసం కోర్టుకెళ్లిన నిహారిక..
Niharika Konidela: అఫీషియల్.. విడాకుల కోసం కోర్టుకెళ్లిన నిహారిక..
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతోందని గత కొంతకాలంగా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. భర్తకు దూరంగా ఉంటున్న నిహారిక.. ఇటీవల వరుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్‌కు ఒంటరిగానే హాజరైంది. దీంతో విడాకుల రూమర్స్ మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నిహారిక విడాకులపై వస్తున్న రూమర్స్‌ను నిజం చేస్తూ డైవర్స్ కోసం కోర్టు మెట్లెక్కింది. జొన్నలగడ్డ వెంకట చైతన్య నుంచి విడాకులు కావాలని కోరుతూ నిహారిక కోర్టుకెళ్లారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో నిహారిక దరఖాస్తు చేసుకున్నారు. హిందూ చట్ట ప్రకారం విడాకుల కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. 2020లో చైతన్యతో నిహారిక వివాహం జరగగా.. కొన్నాళ్ల నుంచి వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు.