పవన్‌కు పోటీగా నితిన్.. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాబిన్ హుడ్..
టాలీవుడ్ యంగ్ హీరో లవర్ బాయ్ నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రాబిన్ హుడ్. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది
పవన్‌కు పోటీగా నితిన్.. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాబిన్ హుడ్..
టాలీవుడ్ యంగ్ హీరో లవర్ బాయ్ నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రాబిన్ హుడ్. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని ఒక ప్రత్యేక పోస్టర్ ద్వారా చిత్ర బృందం తెలియజేసింది.
ఈ మూవీ గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇక ఇప్పుడు మార్చ్ 28న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే ఇదే మార్చి 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు కూడా విడుదలకు సిద్ధమవుతోంది. పవన్ కళ్యాణ్ ను ఎంతో ఆదర్శంగా చూసే నితిన్.. ఆయనను ఎంతో గౌరవిస్తారు. పవన్‌కు నితిన్ వీరాభిమాని. అలాంటి నితిన్ ఇప్పుడు పవన్ తో పోటీపడేందుకు రెడీ అయ్యారు. అయితే ఈ రెండు సినిమాలు ఒకే రోజున వస్తాయా..? లేక పవన్ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉండడంతోనే నితిన్ తన సినిమాని ఈ తేదీకి రిలీజ్ చేస్తున్నారా..? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
నితిన్ రాబిన్ హుడ్ డిసెంబర్ 25న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఆ తర్వాత సంక్రాంతికి తీసుకొచ్చే ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. కానీ థియేటర్ల కొరత కారణంగా ఆ ఆలోచనన మానుకున్నారని సమాచారం. అయితే తాజాగా మార్చి 28న లాక్ చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ అధికారిక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది చూశాక పవన్ అభిమానులకు కొత్త అనుమానాలు మొదయ్యాయి. ఎందుకంటే పవన్ హరిహర వీరమల్లును మార్చి 28న రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. దానికి అనుగుణంగా ప్రమోషన్లు చేసుకుంటూ ఇటీవల లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు.
ఇప్పుడు హఠాత్తుగా రాబిన్ హుడ్ వస్తుందంటే పవన్ ఫ్యాన్స్‌కు సందేహం రావడం సహజమే. రాబిన్ హుడ్ మార్చి 28న రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించడానికి ఓ కారణం ఉన్నట్టు తెలుస్తోంది. హరిహర వీరమల్లు పంపిణీని మైత్రినే తీసుకుందట. కాకపోతే మార్చి 28 రిలీజ్ చేయడం గురించి నిర్మాత ఏఎం రత్నం ఖచ్చితమైన హామీ ఇవ్వలేకపోతున్నారని.. దీంతో సేఫ్ సైడ్ కోసం వేరొకరు తీసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా మార్చి 28న లాక్ చేశారని తెలుస్తోంది. ఒకవేళ వీరమల్లు ఒరిజినల్ డేట్‌కే పూర్తయితే.. అప్పుడు రాబిన్ హుడ్ రిలీజ్ డేట్ మారే అవకాశం ఉన్నట్టు సమాచారం.
వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన రాబిన్ హుడ్‌లో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీష్మ తర్వాత వీరి కాంబోలో వస్తున్న మూవీ కావడంతో రాబిన్ హుడ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.