Nilakanta: ‘నీలకంఠ’ రూరల్ బ్లాక్‌బస్టర్‌గా దూసుకెళ్లింది.. ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం

మాస్టర్ మహేంద్రన్ హీరోగా, రాకేష్ మాధవన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నీలకంఠ’. యష్న ముతులూరి, నేహా పఠాన్ హీరోయిన్లుగా నటించగా, స్నేహా ఉల్లాల్ కీలక పాత్రలో కనిపించారు.

Update: 2026-01-04 08:22 GMT

Neelakanta: ‘నీలకంఠ’ రూరల్ బ్లాక్‌బస్టర్‌గా దూసుకెళ్లింది.. ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం

మాస్టర్ మహేంద్రన్ హీరోగా, రాకేష్ మాధవన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నీలకంఠ’. యష్న ముతులూరి, నేహా పఠాన్ హీరోయిన్లుగా నటించగా, స్నేహా ఉల్లాల్ కీలక పాత్రలో కనిపించారు. ఎం. మమత, ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమా నూతన సంవత్సరం కానుకగా జనవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

చిన్న సినిమాగా విడుదలైన నీలకంఠ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన మొదటి రోజే కోటి రూపాయల కలెక్షన్ సాధించి, రూరల్ బ్లాక్‌బస్టర్గా నిలిచింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని శనివారం చిత్ర యూనిట్ ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర బృందం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంది. హీరో, హీరోయిన్లు, దర్శకుడు, నిర్మాతలు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, డీఓపీ, మ్యూజిక్ డైరెక్టర్ తదితరులు తమ ఆనందాన్ని పంచుకున్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనిల్ మాట్లాడుతూ…

“మీడియాకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా సినిమాకు మొదటి నుంచే మీరు అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారు. మేమంతా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ, మెట్టు మెట్టు ఎక్కుతూ ఇక్కడికి వచ్చాం. ఈ సినిమా కోసం పదేళ్ల పాటు కష్టపడ్డాం. మంచి ప్రొడ్యూసర్, పెద్ద బ్యానర్ దొరికితే హిట్ కొడదామనేది అందరి కలే. కానీ మాకు ఉన్న పరిమితులతో మంచి సినిమా మాత్రమే తీయగలిగాం.

మొదటి రోజే వన్ క్రోర్ కలెక్షన్ రావడం మా శక్తిని చూపించింది. సరైన థియేటర్లు దొరికితే నీలకంఠ ఇంకా బాగా ఆడుతుంది. కోట్ల సంపాదన మా లక్ష్యం కాదు… ఈ సినిమా ప్రతి ఒక్కరికీ చేరాలి. సినిమా మీద ప్యాషన్‌తో చేశాం. మా టీమ్‌ను గుర్తుంచుకోండి… ఇండస్ట్రీలో మా పేర్లు మళ్లీ మళ్లీ వినిపిస్తాయి” అని అన్నారు.

నిర్మాత శ్రీనివాసులు కుమారుడు సాయి మాట్లాడుతూ…

“సినిమా సక్సెస్ కావడమే ఈ సక్సెస్ మీట్‌కు కారణం. ఈ విజయం మా టీమ్ అందరి కష్టం. ఆఫీస్ బాయ్ నుంచి హీరో వరకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించారు. బాక్సాఫీస్ కలెక్షన్ల కోసం కాదు… సినిమా విజయం సాధించినందుకే ఈ మీట్. అందరికీ కంగ్రాట్స్. యాంకర్ స్రవంతి గారికి నేను పెద్ద ఫ్యాన్” అని అన్నారు.

నిర్మాత శ్రీనివాసులు మాట్లాడుతూ…

“మా సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు, ప్రమోట్ చేసిన మీడియాకు ధన్యవాదాలు. మా డైరెక్టర్ రాకేష్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనిల్ ఈ సినిమాకు వెన్నెముకలా నిలిచాడు. హీరో మహేంద్రన్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇంకా పెద్ద స్థాయికి వెళ్లాలి. మా హీరోయిన్, యష్న అద్భుతంగా నటించారు. అందరూ ఈ సినిమాను ఆదరించాలి” అని కోరారు.

నిర్మాత వేణుగోపాల్ మాట్లాడుతూ…

“మీడియాకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడ్డారు. డీఓపీ, మ్యూజిక్ డైరెక్టర్ సినిమాకు ప్రాణం పోశారు. ఈ సినిమాను భుజాల మీద మోసిన దర్శకుడు రాకేష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ నీలకంఠ సినిమాను తప్పకుండా చూడండి” అని అన్నారు.

హీరో మహేంద్రన్ మాట్లాడుతూ…

“ముందుగా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమా ఈ స్థాయికి రావడానికి మీ సపోర్ట్ చాలా ముఖ్యమైనది. మా నిర్మాతలు మమ్మల్ని ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. నిర్మాతల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం నాకు ఎంతో ఆనందం.

దర్శకుడు రాకేష్ కన్ఫిడెన్స్ నాకు చాలా ఇష్టం. ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు… మీరు ఖర్చు చేసిన ప్రతి రూపాయికి మేము రుణపడి ఉంటాం. మీడియా లేకపోతే సినిమా లేదు – అది చిన్నదైనా, పెద్దదైనా. దయచేసి టైమ్ చూసుకుని నీలకంఠ సినిమా చూడండి” అని అన్నారు.

Tags:    

Similar News