Nikhil: ప్యాన్ ఇండియా విడుదల పై ఆసక్తి చూపించని నిఖిల్

Nikhil: ప్యాన్ ఇండియా విడుదల విషయంలో వెనకడుగు వేస్తున్న నిఖిల్

Update: 2022-12-07 08:05 GMT

Nikhil: ప్యాన్ ఇండియా విడుదల పై ఆసక్తి చూపించని నిఖిల్

Nikhil: ఈ మధ్యనే "కార్తికేయ 2" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా ఇప్పుడు "18 పేజెస్" అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. "కార్తికేయ 2" సినిమాలో నిఖిల్ సరసన హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో కూడా నిఖిల్ తో రొమాన్స్ చేయబోతోంది. సుకుమార్ కథ అందించిన ఈ సినిమాని గీత ఆర్ట్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాని హిందీలో కూడా విడుదల చేస్తే బాగుంటుందని దర్శక నిర్మాతలు అనుకుంటున్నారు.

పైగా "కార్తికేయ 2" సినిమాతో నిఖిల్ పేరు కూడా నార్త్ ఇండియాలో మారు మ్రోగి పోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాని హిందీలో కూడా విడుదల చేస్తే బాగుంటుందని గీత ఆర్ట్స్ భావిస్తుందట. అయితే నిఖిల్ కి మాత్రం "18 పేజెస్" ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ అని దానికి ప్యాన్ ఇండియా రిలీజ్ సెట్ అవ్వదు అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. నిఖిల్ కి సినిమా పైన చాలా నమ్మకం ఉన్నప్పటికీ ప్యాన్ ఇండియా విడుదల విషయంలో అంతగా ఆసక్తి చూపించడం లేదట. పైగా హిందీలో విడుదల చేయాలంటే అక్కడ కూడా ప్రమోషన్స్ కి ఎక్కువ సమయం వెచ్చించాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో తెలుగులో ప్రమోషన్లు చేయటం తక్కువ అయితే అది తెలుగు రాష్ట్రాల్లో సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంది. అయితే ఇక్కడ సినిమా విడుదలైన తర్వాత హిందీ డబ్బింగ్ వర్షన్ ని థియేటర్లలో గాని ఓటీటీలలో కానీ విడుదల చేయడానికి తనకు అభ్యంతరం లేదని ఆ విషయంలో నిర్మాతలు ఫైనల్ కాల్ తీసుకోమని నిఖిల్ చెబుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు డిసెంబర్ 23న థియేటర్లలో విడుదల కాబోతున్న "18 పేజెస్" సినిమా ప్రమోషన్స్ తో చిత్ర బృందం బిజీ గా ఉంది.

Tags:    

Similar News