Sobhita Dhulipala: అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న శోభితా
Sobhita Dhulipala: అక్కినేని నాగచైతన్య దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే అక్కినేని కుటుంబంలోకి ఓ చిన్నారి అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్కినేని నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ్ల తల్లి కాబోతున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. శోభిత ప్రస్తుతం గర్భవతి అనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్త చూసి అంతా షాక్ అవుతున్నారు. త్వరలోనే అక్కినేని కుటుంబంలోకి ఓ చిన్నారి అడుగుపెట్టబోతున్నట్లు తెలిసి ఫ్యాన్స్ ఈ జంటకు పెద్దెత్తున విషేస్ చెబుతున్నారు.
కాగా గత ఏడాది డిసెంబర్ 4న నాగచైతన్య శోభిత ధూళిపాళ వివాహం జరిగింది. సమంతో విడాకుల అనంతరం శోభితతో నాగచైతన్య ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వారిద్దరూ కలిసి పలుమార్లు బయట కనిపించడంతో వారి సంబంధం నిజమే అయ్యింది. తర్వాత నిశ్శబ్దంగా నిశ్చితార్థం కూడా చేసుకుని సాదాసీదా పెళ్లి చేసుకున్నారు. అక్కినేని కుటుంబంతోపాటు శోభిత కుటుంబం అంగీకారంతో వీరిద్దరి పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన ఎన్నో విషయాలతోపాటు పెళ్లి ఫొటోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి.