OTT: రేపు ఓటీటీలో సందడి చేయనున్న రెండు తెలుగు సినిమాలు!

Telugu OTT movies this week: తెలుగు సినీ ప్రేమికులకు శుభవార్త. రేపు శుక్రవారం (జూలై 19) న రెండు ఆసక్తికరమైన తెలుగు సినిమాలు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి.

Update: 2025-07-17 07:16 GMT

OTT: రేపు ఓటీటీలో సందడి చేయనున్న రెండు తెలుగు సినిమాలు!

Telugu OTT movies this week: తెలుగు సినీ ప్రేమికులకు శుభవార్త. రేపు శుక్రవారం (జూలై 19) న రెండు ఆసక్తికరమైన తెలుగు సినిమాలు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి. ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న 'కుబేర' మరియు 'భైరవం' సినిమాలు ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

అమెజాన్ ప్రైమ్‌లో 'కుబేర' స్ట్రీమింగ్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'కుబేర' చిత్రంలో కింగ్ నాగార్జున ఒక సీబీఐ ఆఫీసర్‌గా, నటుడు ధనుష్ ఓ బిచ్చగాడి పాత్రలో కనిపించనున్నారు. రష్మిక మందన్నా ఓ కీలక పాత్రలో ఆకట్టుకోగా, బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ ఈ సినిమాతో టాలీవుడ్‌లో విలన్‌గా అరంగేట్రం చేశాడు. వినూత్న కథాాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన కొత్త కోణంగా ముద్ర వేసుకుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, రష్మిక పాత్రకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఈ సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. ఈ చిత్రం జూలై 19 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

'జీ5'లో భైరవం విడుదల

ఇదే రోజు జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై మరో క్రేజీ సినిమా 'భైరవం' ప్రేక్షకులను అలరించనుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్లుగా అలరించారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. మే 30న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీకి రావడం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది.

రేపటి నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ రెండు సినిమాలు, ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తాయో చూడాలి!

Tags:    

Similar News