Sreeleela: ఏదో పెళ్లాన్ని అడిగినట్టు అడిగారు - శ్రీలీల
టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెండితెరపైనే కాదు, బయట కూడా తన చలాకీతనంతో అందరినీ ఆకట్టుకుంటుంది.
Sreeleela: ఏదో పెళ్లాన్ని అడిగినట్టు అడిగారు - శ్రీలీల
టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెండితెరపైనే కాదు, బయట కూడా తన చలాకీతనంతో అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన ‘జూబిలేషన్’ ఫెస్ట్‌లో శ్రీలీల చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన ‘జూబిలేషన్ 2K26’ వేడుకలకు శ్రీలీల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె స్టేజ్‌పైకి రాగానే కాలేజీ ప్రాంగణమంతా విద్యార్థుల అరుపులు, కేకలతో హోరెత్తిపోయింది.
స్టూడెంట్స్‌తో ముచ్చటిస్తూ శ్రీలీల ఎమోషనల్ అయ్యారు. చిన్నప్పుడు నరసరావుపేటకు వచ్చిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూనే.. తన అమ్మమ్మ, తాతయ్యల ఊరు ఒంగోలు అని చెప్పగానే విద్యార్థులు ఫుల్ జోష్‌లోకి వచ్చారు. "చదువు చాలా ముఖ్యం, జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగాలి" అంటూ యువతకు స్ఫూర్తినిచ్చే సందేశాన్ని ఇచ్చారు.
చాలాసేపు మాట్లాడిన తర్వాత.. మిమ్మల్ని చూసి అరిచి అరిచి నా గొంతే పోయింది అంటూ శ్రీలీల నవ్వుతూ వ్యాఖ్యానించారు. అయితే అక్కడున్న విద్యార్థులు మాత్రం వదిలిపెట్టకుండా..శ్రీలీల.. డాన్స్ చేయాలి.. డాన్స్ అంటూ గట్టిగా డిమాండ్ చేశారు. సాధారణంగా ఇలాంటి సమయంలో సెలబ్రిటీలు కొంచెం ఇబ్బంది పడతారు. కానీ శ్రీలీల మాత్రం తనదైన శైలిలో చమత్కరించారు. నిజంగా పెళ్లాన్ని అడిగినట్టు అడిగారు.. సరే డ్యాన్స్ చేద్దాం రండి అంటూ అక్కడున్న వారిని ఆమె ఉత్సాహపరిచారు
ఆమె అన్న ఆ మాటలకు అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. ఆమె స్పాంటినిటీకి ఫిదా అయిన విద్యార్థులు కేరింతలు కొట్టారు. అన్నట్టుగానే, విద్యార్థులతో కలిసి ఆమె వేసిన స్టెప్పులు ఈ వేడుకకే హైలైట్‌గా నిలిచాయి. ఒకవైపు ఇలాంటి ఈవెంట్స్‌తో సందడి చేస్తూనే, మరోవైపు క్రేజీ ప్రాజెక్టులతో శ్రీలీల బిజీగా ఉంది. పవన్ కళ్యాణ్ సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో నటిస్తున్న ఈ బ్యూటీ, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన కూడా ఒక భారీ చిత్రంలో అవకాశం దక్కించుకుంది.